Atmakur Bypoll: ముగిసిన గడువు.. మొత్తం వచ్చిన నామినేషన్‌లు ఎన్ని?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో కొన్నిరోజుల్లో మరోసారి ఎన్నికల సమరం జరగనుంది. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణంతో ఆత్మకూరు ఉప ఎన్నిక నిర్వహించడం అనివార్యమైంది. నేటితో ఆత్మకూరు ఉప ఎన్నిక నామినేషన్‌ల పర్వం కూడా ముగిసింది. చివరి రోజైన సోమవారం నాడు 13 నామినేషన్‌లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 28 నామినేషన్లు దాఖలైనట్లు స్పష్టం చేశారు. మంగళవారం నాడు నామినేషన్‌ల పరిశీలన జరుగుతుందని తెలిపారు. ఆత్మకూరు ఉప ఎన్నికకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ దూరంగా ఉండటంతో ప్రధానంగా పోటీ వైసీపీ, బీజేపీల మధ్యే ఉండనుంది. అధికార పార్టీ వైసీపీ అభ్యర్థిగా మేకపాటి కుటుంబం నుంచి గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి బరిలో ఉన్నారు.
Andhra Pradesh: ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్
Also Read
- Municipal Elections: మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై కొత్త నిబంధనలు.. నామినేషన్ డిపాజిట్లు ఖరారు..
- Nara Lokesh: ఏపీ నిరుద్యోగులకు తీపి కబురు.. 2029లోపు మరో మూడు డీఎస్సీలు..
- Ganesh Mandapam: వినాయక మండపాలపై కీలక ఆదేశాలు.. ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే..
- New ZPs: ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్వ్యవస్థీకరణ.. 13 నుండి 28కి పెరిగిన కొత్త జెడ్పీలు..
మరోవైపు ఆత్మకూరు ఉప ఎన్నిక కోసం వైసీపీ ఇంఛార్జులను నియమించింది. అనంతసాగరం మండలానికి మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఏఎంఎస్ పేట మండలానికి మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, ఆత్మకూరు పట్టణానికి మంత్రి అంజాద్ బాషా, ఎమ్మెల్యే గండికోట శ్రీకాంత్ రెడ్డి, ఆత్మకూరు రూరల్ మండలానికి మంత్రి కారుమూరు నాగేశ్వరరావు, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, చేజర్ల మండలానికి మంత్రి ఆర్.కె. రోజా, మాజీమంత్రి కొడాలి నాని, మర్రిపాడు మండలానికి మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల్, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, సంగం మండలానికి మంత్రి నారాయణ స్వామి, ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఇంఛార్జులుగా వైసీపీ అధిష్టానం నియమించింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : సిరిసిల్ల, సిద్దిపేట గడ్డమీద మూడు రంగుల జెండా ఎగరేస్తాం
-
HYDRAA : గణేష్ నిమజ్జనాలపై ఫేక్ ప్రచారం.. రంగనాథ్ క్లారిటీ..!
-
PM Modi: ఎస్ఆర్సీసీ నుంచి బయటకొచ్చినోళ్లు గొప్పోళ్లు కాకపోవచ్చు.. కానీ..!
-
Municipal Elections: మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై కొత్త నిబంధనలు.. నామినేషన్ డిపాజిట్లు ఖరారు..
-
Kangana Ranaut: అధికారులపై కంగనా రనౌత్ రుసరుసలు.. ఏం చేశారంటే..!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!