నెల్లూరు జిల్లాలో బంగారు నిక్షేపాలు, రాగి నిల్వలు గుర్తించారు.. ఉదయగిరి మండలం మాసాయిపేటలో బంగారు నిక్షేపాలు, రాగి నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది… జల్లాలోని ఐదు ప్రాంతాల్లో 46 నమూనాలను సేకరించింది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా.. రెండు వేల హెక్టర్లకు పైగా నిక్షేపాలు ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేసింది.. కేంద్ర ప్రభుత్వ అనుమతులతో డ్రిల్లింగ్ పనులు వేగవంతం చేయనున్నారు.. బంగారు నిక్షేపాలతో పాటు రాగి నిల్వలు 20 నుండి 110 మీటర్లలోపు…
నెల్లూరు జిల్లాలో కాల్పులు కలకలం సృష్టించాయి.. పొదలకూరు మండలం తాటిపర్తిలో తుపాకీ కాల్పులతో స్థానికులు ఉలిక్కిపడ్డారు.. పెళ్లి చేసుకునేందుకు తనకి అమ్మాయిని ఇవ్వలేదనే అక్కసుతో కావ్య అనే అమ్మాయి (26)పై తుపాకీతో కాల్పులు జరిపాడు సురేష్ రెడ్డి అనే యువకుడు.. ఆ తర్వాత తనను తాను రివాల్వర్‌తో కాల్చుకున్నాడు.. కాల్పుల్లో గాయపడిన కావ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందగా.. సురేష్ రెడ్డి కూడా ఆ తర్వాత మృతిచెందాడు. Read Also: Mahesh Babu: సితార టాలీవుడ్ ఎంట్రీ.. కన్ఫర్మ్…
ఏపీలో కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ సందర్భంగా నెల్లూరు జిల్లా వైసీపీ నేతల్లో విభేదాలు బయటపడుతున్నాయి. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అభినందన సభలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి ఆరోపణలు చేశారు. మూడేళ్లుగా జిల్లాలో ఇరిగేషన్‌కు సంబంధించి ఆశించిన మేర అభివృద్ధి జరగలేదంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఆనం వ్యాఖ్యలకు తాజాగా అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో రూ.3 వేల కోట్లతో నీటిపారుదల పనులు జరుగుతున్నాయని…
ఏపీలో రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. ఎక్కడైనా అధికార, విపక్షాల మధ్య వార్ ఉంటుంది. కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం స్వపక్షంలో విపక్షం అన్న పరిస్థితి నెలకొంది. ఇటీవల మంత్రివర్గ విస్తరణ కొందరు నేతల మధ్య వార్‌కు కారణంగా మారింది. నెల్లూరు జిల్లాలో తనకు మరోసారి మంత్రి పదవి రాకపోవడంపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కినుక వహించినట్లు టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలో మంత్రి జిల్లాకు వస్తున్న…
నెల్లూరు జిల్లాలో అతిపెద్ద మద్యం స్కాం బయటపడింది. జిల్లాలోని పలు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఇతర రాష్ట్రాల మద్యం బాటిళ్లు విచ్చలవిడిగా కనిపిస్తున్నాయి. నకిలీ స్టిక్కర్లతో ప్రభుత్వ వైన్ షాపులకు గోవా లిక్కర్ సరఫరా అవుతోంది. కొందరు అక్రమార్కులు గోవా నుంచి నెల్లూరు జిల్లా మైపాడుకు తారు ట్యాంకర్ల ద్వారా మద్యం సరఫరా చేస్తున్నారు. గోవాలో 25 రూపాయలకు క్వార్టర్ బాటిల్ కొనుగోలు చేసి నెల్లూరు జిల్లాలో 100 రూపాయలకు వాటిని విక్రయిస్తున్నారు. అయితే ఈ స్కాం…
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే విదేశీ పర్యాటకురాలిపై నెల్లూరు జిల్లాలో అత్యాచారయత్నం కలకలం సృష్టించింది.. అయితే, ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఏపీ పోలీసులు…గంటల వ్యవధిలోనే అత్యాచాయత్నానికి పాల్పడిన దుండగులను అరెస్ట్ చేశారు. ఇక, ఈ ఘటనపై స్పందించిన బాధితురాలు కరోలినా.. ఇండియా చూద్దామని వచ్చా.. కానీ, ఇలా జరుగుతుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. చెన్నై నుంచి గోవాకు వెళ్తుండగా సాయి కుమార్ (నిందితుడు) పరిచయమయ్యాడని తెలిపిన ఆమె… ఆ తర్వాత సైదాపురం వద్ద నాపై…
ఏపీ అసెంబ్లీలో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మరణంపై సీఎం జగన్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లా కోసం దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి కన్న కలలను తాము సాకారం చేస్తామని చెప్పారు. నెల్లూరు జిల్లాలోని సంగం బ్యారేజీకి గౌతమ్‌రెడ్డి పేరు పెట్టి ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేలా చేస్తామని అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ ప్రకటించారు. తన సహచరుడు, మిత్రుడు మేకపాటి గౌతమ్ రెడ్డి లేడని ఊహించడం కష్టంగా ఉందని.. గౌతమ్…
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం వల్ల కొన్ని ప్రాంతాల్లో భారీవర్షాలు పడే అవకాశం వుందని భారత వాతావరణ కేంద్రం తాజా హెచ్చరికలు చేసింది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారే అవకాశం ఉంది. శ్రీలంక తీరానికి సమీపంలో హిందూ మహాసముద్రానికి ఆనుకుని కొనసాగుతోందని ఐఎండీ వెల్లడించింది. రాగల 24 గంటల్లో ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనించి శ్రీలంక తీరానికి సమీపంలోకి వస్తుందని, ఆపై మరో 24 గంటల్లో తమిళనాడు తీరానికి…
నెల్లూరులోని ఓ ప్రైవేట్ కాలేజీకి చెందిన బీ ఫార్మసీ విద్యార్థుల నిర్వాకం వల్ల ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లి గ్రామానికి చెందిన బి.శ్రీకాంత్(28)కు వివాహమైంది. అయితే పెళ్లయిన ఆరునెలలకే భార్య విడిచి వెళ్లిపోయింది. దీంతో శ్రీకాంత్ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఒంగోలులో ఉంటున్నాడు. అతడికి విశాఖకు చెందిన మోనాలీసా అనే హిజ్రాతో పరిచయం ఏర్పడింది. ఆరునెలల కిందట శ్రీకాంత్, మోనాలిసాలకు ఓ యాప్ ద్వారా నెల్లూరులోని…
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉండే క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. భీమ్లానాయక్ మూవీ విడుదల నేపథ్యంలో ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని కొందరు థియేటర్ యజమానులు కక్కుర్తికి తెర తీశారు. నెల్లూరులోని స్పైస్ సినిమా థియేటర్ నిర్వాహకులు ప్రస్తుతం ఇదే పనిలో పడ్డారు. తమ థియేటర్లో భీమ్లా నాయక్ సినిమా చూడాలంటే సినిమా టిక్కెట్‌తో పాటు ఫుడ్ కూపన్ కూడా కొనాల్సిందేనని షరతు పెట్టారు. దీంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా టిక్కెట్ కోసం వస్తే…