Rapido Suicide : రాజేంద్రనగర్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉప్పర్‌పల్లి హ్యాపీ హోమ్స్ కాలనీకి చెందిన ఆరిఫ్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం మధ్యాహ్నం రాపిడో యాప్ ద్వారా బుక్ చేసిన మోటార్ సైకిల్‌పై హిమాయత్ సాగర్ జలాశయానికి చేరుకున్నాడు. అక్కడ ఉన్నవారి కళ్లముందే జలాశయంలోకి దూకాడు. ఈత రాకపోవడంతో క్షణాల్లోనే నీట మునిగిపోయాడు. సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు ప్రారంభించాయి. అయితే ఆరిఫ్‌ను ఇప్పటివరకు గుర్తించలేకపోయారు. ప్రాథమిక దర్యాప్తులో, ఆరిఫ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు, ఆసుపత్రి ఖర్చులు భరించే స్థోమత లేకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Vitiligo Disease: చర్మంపై తెల్లని మచ్చలు కనిపిస్తున్నాయా?.. వ్యాధి ఏంటో తెలుసా!