Breaking News: పొంచి ఉన్న ముప్పు.. ఉత్తరాఖండ్‌లో మరో వరద భయం!
- ఉత్తరాఖండ్‌లో నేడు విద్యా సంస్థలకు సెలవు..
- రెస్క్యూ ఆపరేషన్లో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు..
- భగీరథి నది ప్రవాహాన్ని అడ్డుకున్న ఖీర్ గంగ ప్రాంతంలో వచ్చిన బురద..
- ఉత్తరకాశీ జిల్లాలో మరికొన్ని గ్రామాలకు పొంచి ఉన్న ప్రమాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Breaking News: ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలోని ఉత్తరకాశీ (Uttarkashi) జిల్లా ధరాలీ గ్రామాన్ని వరద ప్రవాహాం ముంచెత్తింది. మంగళవారం నాడు మధ్యాహ్నం 2 గంటల సమయంలో.. క్లౌడ్‌బరస్ట్ దెబ్బకు అతి వేగంగా దూసుకొచ్చిన ఖీర్ గంగానది దారిలో ఉన్న చెట్టు, చేమ, బురద, కొండచరియలను కలుపుకుని రావడంతో గ్రామంలోని ఇళ్లు, పెద్ద పెద్ద భవనాలు ఒక్కసారిగా పేకమేడల్లా నేలకూలిపోయాయి. జలప్రళయం నుంచి తప్పించుకునేందుకు.. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని.. పరుగులు తీసిన ఫలితం లేకుండా పోయింది. కళ్లుమూసి తెరిచేలోపే వరద బురద వారిని ముంచెత్తిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విలయంలో ఇప్పటిదాకా 12 మంది మృతదేహాలు లభించాయి.. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది.
Read Also: Vijay Deverakonda : బాక్సాఫీస్ హిట్ కొట్టిన .. విజయ్ కి తప్పని తిప్పలు
Also Read
అయితే, ఉత్తరాఖండ్ (Uttarakhand)లో నేడు (ఆగస్టు 6న) విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. నిన్న విధ్వంసం జరిగిన ప్రదేశాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ (Rescue Operations) కార్యక్రమాల్లో ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిమగ్నమైయ్యాయి. కాగా, మరోసారి భగీరథి నది ప్రవాహాన్ని ఖీర్ గంగ ప్రాంతంలో వచ్చిన బురద, కొండచరియలు అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. కాగా, ఉత్తరకాశీ (Uttarkashi) జిల్లాలో మరికొన్ని గ్రామాలకు మరో పెను ప్రమాదం పొంచి ఉంది.
తాజావార్తలు
-
Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
-
Excise Policy: ఏపీ 2026-27 ఎక్సైజ్ పాలసీ.. లాటరీ ద్వారా షాపుల కేటాయింపు..
-
Nani: మా డైరెక్టర్ ఎవరినీ కొట్టలేదు.. నాని కీలక వ్యాఖ్యలు
-
Packard Bell: మార్కెట్లోకి పాకర్డ్ బెల్.. ఏసర్ నుంచి ఆరెంజ్, పర్పుల్, గ్రీన్, ఎల్లో కలర్స్‌లో అందుబాటులోకి..
-
BRICS: ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోడీ భేటీ.. వారాల వ్యవధిలో రెండోసారి..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?