SLBC Tragedy: శ్రీశైలం ఎడమ కాల్వ (SLBC) టన్నెల్‌లో చోటు చేసుకున్న విషాదకర ఘటన నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్‌లు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ టన్నెల్‌లో ఇటీవల నీటి ప్రవాహం కారణంగా కొందరు 8 మంది కార్మికులు చిక్కుకొని చనిపోవడంతో.. ఈ ప్రమాదం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక ప్రమాదంలో చనిపోయిన వారి డెడ్ బాడీస్ ను తొలిగించిన తర్వాత.. ఫైర్ డీజీ (DG, FIRE) నాగిరెడ్డి స్వయంగా టన్నెల్‌లోకి వెళ్లి పరిస్థితులను సమీక్షించారు. టన్నెల్ లో ఉన్న భయానక పరిస్థితులను చూసిన ఆయన, రెస్క్యూ బృందాలు అత్యంత సాహసోపేతంగా పనిచేస్తున్నారని కొనియాడారు.
Read Also: MLC Elections 2025: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు.. పేరాబత్తుల రాజశేఖరం విజయం..
జీరో పాయింట్ నుంచి 12 కిలోమీటర్ల వరకు టన్నెల్ లో నీరు నిలిచిపోయిందని, డీ వాటరింగ్ (De-Watering) ఇంకా పెద్దెత్తున చేపట్టాల్సిన అవసరం ఉందని నాగిరెడ్డి తెలిపారు. రెస్క్యూ బృందాలు ఎటువంటి ప్రమాదాన్నీ లెక్కచేయకుండా ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయని వివరించారు. టన్నెల్ లోని నీటిని తొలగించడంలో, చిక్కుకుపోయిన వారిని రక్షించడంలో ఫైర్, ఎన్‌ఐడీఆర్‌ఎఫ్, ఇతర సంబంధిత బృందాలు రాత్రింబవళ్ళు కృషి చేస్తున్నాయి. అధికారులు త్వరలోనే సహాయక చర్యలు పూర్తి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.