Reactor Blast: భారీ క్రేన్ లతో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Reactor Blast: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు సమీపంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో ఘోర ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం సీగాచి కెమికల్స్ పరిశ్రమలో రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ పేలుడు ధాటికి పరిశ్రమ తునాతునకలైంది. ఇప్పటివరకు 10 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, 30 మందికి పైగా గాయాలపాలయ్యారు. వీరిలో 10 మందికి పైగా పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
Read Also:Kubera : పదేళ్లకే అన్నీ తెలుస్తున్నాయ్.. శేఖర్ కమ్ముల షాకింగ్ కామెంట్స్
Also Read
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
ఉదయం 9 గంటల సమయంలో పరిశ్రమలో పని సాగుతున్న సమయంలోనే రియాక్టర్ భారీ శబ్దంతో పేలిపోయింది. దీంతో కంపెనీకి చెందిన షెడ్, గ్రౌండ్ +2 అంతస్తుల అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కుప్పకూలిపోయాయి. రెండో అంతస్తులో పనిచేస్తున్న సిబ్బంది పేలుడుతో కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. రియాక్టర్ చుట్టుపక్కల ఉన్న 8 మంది సజీవ సమాధి అవ్వగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు మృతిచెందారు.
Read Also:Sriram Venu: ఆర్టికల్ స్ఫూరితో “తమ్ముడు” కథ.. ట్రెండ్ ఫాలో అవుతున్నాం!
ప్రస్తుతం మరికొందరు శిథిలాల కింద చిక్కుకుపోయి ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు భారీ క్రేన్‌లు, హైడ్రాలిక్ పరికరాలతో శిథిలాలను తొలగిస్తున్నాయి. మరో 3 గంటల్లో శిథిలాల తొలగింపు పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ఈ ఘటన పట్ల పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై మరొకసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తాజావార్తలు
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!