మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు హిందీని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. జాతీయ విద్యా విధానం ప్రకారం త్రిభాషా సూత్రాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాఠ్యాంశాల్లో హిందీని తప్పనిసరి చేస్తూ ప్రింటింగ్ చేస్తోంది.
CM MK Stalin: 2026లో తమిళనాడులో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తిప్పికొట్టారు. మా తమిళనాడు రాష్ట్రం ఎప్పటికీ ఢిల్లీ నియంత్రణలో ఉండదని అన్నారు.
GVMC Mayor: గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ పై అవిశ్వాసం కోసం చివరి 24 గంటలు మిగిలి ఉన్నాయి. దీంతో ఈరోజు ( ఏప్రిల్ 18న ) మలేషియా క్యాంప్ నుంచి నగరానికి ఎన్డీయే కూటమి కార్పొరేటర్లు రానున్నారు.
రాజధానిని స్మశానం అన్నారు.. ఈ రోజు స్వేచ్చా వాతావరణంలో మాట్లాడుకుంటున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 2019 నుంచి 2024 వరకూ భయంకరమైన వాతావరణం ఉంది.. నా జీవితంలో అలాంటిది ఎప్పుడూ చూడలేదు.. నేనుకూడా బయటకు రాలేని పరిస్థితి ఉండేదన్నారు.. హెలికాప్టర్ లో వస్తే కింద ఉన్న చెట్లను నరికేశారు.
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ( ఏప్రిల్ 14న ) గుంటూరు జిల్లాలోని తాడికొండ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రజా సమస్యలపై ప్రధానంగా చర్చిస్తారు.
Amit Shah: శుక్రవారం చెన్నైలో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తును అమిత్ షా అధికారికంగా ధ్రువీకరించారు. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నట్లు వెల్లడించారు. విలేకరుల సమావేశంలో మాట్లాడిన అమిత్ షా, అధికార డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ తమిళ భాష, తమిళ సంస్కృతిని గౌరవిస్తుందని, సీఎం స్టాలిన్ తమిళ భాష కోసం ఏం చేశారని ప్రశ్నించారు.
AIADMK-BJP: తమిళనాడు ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే, బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. మాజీ సీఎం ఎడప్పాడి పళని స్వామి నేతృత్వంలో రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు చెప్పారు. చెన్నైలో జరిగిన విలేకరుల సమావేశంలో పొత్తుపై అమిత్ షా క్లారిటీ ఇచ్చారు.
PM Modi: ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో రూ.3,880 కోట్ల విలువైన 44 ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీలది కుటుంబ ప్రయోజనాలపై మాత్రమే దృష్టి పెడతారని విమర్శించారు.
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పై అవిశ్వాసం తీర్మానం చుట్టూ రాజకీయం రసకందాయంలో పడింది. అవిశ్వాసం నెగ్గితే మేయర్, డిప్యూటీ మేయర్ పంపకాలపై కూటమిలో ఏకాభిప్రాయం కుదరడం లేదు. డిప్యూటీ మేయర్ పై క్లారిటీ రాకుండా క్యాంప్ రాజకీయాలకు వెళ్లలేమని జనసేనలో సగం మంది కార్పొరేటర్లు తేల్చేశారు.