GVMC Mayor: గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ పై అవిశ్వాసం కోసం చివరి 24 గంటలు మిగిలి ఉన్నాయి. దీంతో ఈరోజు ( ఏప్రిల్ 18న ) మలేషియా క్యాంప్ నుంచి నగరానికి ఎన్డీయే కూటమి కార్పొరేటర్లు రానున్నారు. ఇక, ఎయిర్ పోర్టు నుంచి నేరుగా భీమిలి శిబిరానికి తెలుగు దేశం పార్టీ తరలించనుంది. ప్రత్యేక కౌన్సిల్ సమావేశం కోసం అధికార యంత్రాంగం విస్తృతమైన ఏర్పాట్లు చేస్తుంది. GVMC పరిసరాల్లో కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. పూర్తి పారదర్శకం కౌన్సిల్ సమావేశం జరిగేలా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు మినహా ఇతరులకు GVMC పరిసరాల్లోకి నో ఎంట్రీ విధించారు. జీవీఎంసీ ఆఫీసు పరిధిలో సుమారు 300 మంది పోలీసులను భద్రత కోసం వినియోగించే అవకాశం ఉంది.