ఏపీ వృద్దిరేటు దేశంలో రెండో స్థానానికి చేరడంపై ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్ అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాష్ట్రం గాడిన పడడంతో పాటు కాన్ఫిడెన్స్ పెంచేలా వృద్ది రేటు సాధించామన్నారు.
Ponguleti Sudharkar Reddy : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సహ ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై దేశవ్యాప్తంగా ప్రజాదరణ పెరుగుతోందని, ఆయన నాయకత్వంపై ప్రజలు మరింత ఆకర్షితులవుతుండటంతో, కొన్ని పార్టీలు మోడీ పై తప్పుడు ప్రచారానికి తెగబడుతున్నాయని ఆరోపించారు. ‘ఉత్తర–దక్షిణ’ అనే వాదనను ప్రొత్సహించి మోడీ గారిపై విమర్శలు చేస్తుండటం రాజ్యాంగ ఉల్లంఘనగా అభివర్ణించారు. కర్ణాటకలో ఎప్పుడెన్నికలు జరిగినా బీజేపీ గెలుస్తోందని, తమిళనాడులోనూ రాజకీయ సమీకరణాలు…
CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని ముప్పాళ్లలో డాక్టర్ జగ్జీవన్ రాం జయంతి వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో ఎన్డీయే కూటమి ప్రభుత్వం పని చేస్తోంది అన్నారు.
MLC Nagababu: జనసేన పార్టీ శాసన మండలి సభ్యులు నాగబాబు ఈ రోజు (ఏప్రిల్ 5న) పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ క్రమంలో తెలుగు దేశం, జనసేన పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది.
గత ప్రభుత్యం మాదిరి కక్షసాధింపు చర్యలతో జైళ్ళలో పెట్టాలని మేం ఆలోచించడం లేదు అని కేంద్రమంత్రి రామ్మోహన నాయుడు తెలిపారు. స్వేచ్చ, స్వాతంత్ర్యంతో వ్యవహరించేలా పని చేస్తున్నాం.. అయితే, అంబేద్కర్ కేవలం దళిత నాయకుడు కాదు.. ప్రతి భారతీయుడు గర్వపడే వ్యక్తి అని ఆయన కొనియాడారు.
3వ తేదీన లోక్ సభలో, 4న రాజ్యసభలో పాస్ అయింది వక్ఫ్ బిల్లు.. దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల అభిప్రాయ సేకరణ చేయాలని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేశాం.. 92 లక్షలకు పైగా పిటిషన్స్ జేపీసీకి వచ్చాయి.. 25 రాష్ట్రాల నుంచి వక్ఫ్ బోర్డులు వాళ్ళ రిప్రెజెంటేషన్ ఇచ్చారు అని పురంధేశ్వరి చెప్పుకొచ్చింది.
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు (ఏప్రిల్ 5న) ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం చందర్లపాడు మండలంలో పర్యటించనున్నారు. బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా ముప్పాళ్లలో ఏర్పాటు చేస్తున్న ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొని స్థానిక ప్రజలతో ముఖాముఖి మాట్లాడనున్నారు.
వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందింది. ఇక బిల్లు రాష్ట్రపతి భవన్కు వెళ్లనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపితే చట్టంగా మారనుంది. బిల్లు చట్టంగా మారకముందే సుప్రీంకోర్టు తలుపులు తట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది.
Kiren Rijiju: రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లు-2025, ది ముస్లమాన్ వక్ఫ్ రద్దు బిల్లు-2025 రెండు బిల్లులను పార్లమెంటరీ, మైనారిటీ వ్యవహరాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశ పెట్టారు.
ఎట్టకేలకు వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. బుధవారం బిల్లుపై పార్లమెంట్లో వాడీవేడీగా చర్చ జరిగింది. దాదాపు 12 గంటల పాటు అధికార-ప్రతిపక్ష సభ్యులు ప్రసంగించారు.