CM Chandrababu: దేవాదాయ శాఖలో 137 ఉద్యోగాల భర్తీకి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. డిప్యూటీ కమిషనర్ సహా గ్రేడ్ 1, 3 ఈవో పోస్టుల ఖాళీలను భర్తీ చేయాలని పేర్కొన్నారు.
Minister Savitha: సీఎం చంద్రబాబు పాలన చేనేతలకు స్వర్ణయుగం లాంటింది మంత్రి సవిత తెలిపారు. 200ల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.. ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్ లు పెడుతున్నాం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది.. సొంతంగా భూమి ఉన్న రైతులే కాదు.. ఇతరుల పొలాలను కౌలు తీసుకుని వ్యవసాయం చేసే కౌలు రైతులకూ సాయం చేయాలని నిర్ణయం తీసుకుంది.. ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద ఒక్కో రైతు కుటుంబానికి రూ.20 వేల చొప్పున అందించాలనే నిర్ణయానికి వచ్చింది.. ఆ రూ.20 వేలను మూడు విడతల్లో రైతులను అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.. పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేలతో కలిపి ఈ…
వనమాడి వెంకటేశ్వరరావు అలియాస్ కొండబాబు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే. ఆరు సార్లు పోటీ చేసి మూడు విడతలు గెలిచారాయన. కానీ... ఈసారి తాను గెలిచి, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఆయన వైఖరి కాస్త మారినట్టు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. నియోజకవర్గంలో జరుగుతున్న వ్యవహారాల్లో ఎక్కడా పార్టీ నాయకులు ఇన్వాల్వ్ కావద్దని చెబుతున్నారట ఎమ్మెల్యే.
పార్టీ రీఛార్జ్ ప్రోగ్రామ్‌లో భాగంగా తాడేపల్లి సెంట్రల్ ఆఫీస్‌లో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు వైసీపీ అధ్యక్షుడు జగన్. కింది స్థాయి నుంచి కీలకమైన పొలిటికల్ అడ్వైజరీ కమిటీలు, జిల్లా అధ్యక్షులతో మీటింగ్‌లు నడుస్తున్నాయి. అలాగే పెండింగ్‌లో ఉన్న పార్టీ పదవుల్ని సైతం భర్తీ చేస్తున్నారు. ఇలా... అధికారంలో ఉన్నప్పటికంటే కూడా ఎక్కువగా పార్టీ యాక్టివిటీ నడుస్తుండటంతో.. ఏదో.. ఉంది, ఏం జరుగుతోందన్న అమమానాలు మొదలయ్యాయట రాజకీయ వర్గాల్లో.
Amaravati Restart Event Live Updates: ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరో మహోన్నత ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభోత్సవ కార్యక్రమం మొదలు కానుంది.
మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. రైతుల అవసరాల కోసం చెరువుల్లో పూడిక తీసిన మట్టిని, క్యూబిక్ మీటర్ ఒక్క రూపాయుకే, రైతులకు సరఫరా చేసేలా అనుమతులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చారని తెలిపారు.
ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడం అని తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలు చేస్తే యాక్షన్ తీసుకుంటాం అని పేర్కొన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.
2019-24 వైసీపీ ప్రభుత్వంలో 32 వేల కోట్లు కేటాయిస్తే, కేవలం 9 నెలల్లోనే కూటమి ప్రభుత్వం 35 వేల కోట్లు ఇరిగేషన్ శాఖకు కేటాయించింది.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని అటకెక్కించారు అని ఆరోపించారు. మహేంద్ర తనయ ప్రాజెక్ట్ లను నిర్వీర్యం చేశారు.. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ హయాంలో అసెంబ్లీ స్పీకర్, రెవెన్యూ మంత్రి, పశుసంవర్ధక మంత్రి ఉన్నా, ఈ జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులకు చేసింది శూన్యం అంటూ మంత్రి రామానాయుడు పేర్కొన్నారు.
Minister Nimmala: నేటి నుంచి రాజమండ్రి జిల్లాలో 45 ఇసుక ర్యాంపులకు అనుమతి ఇస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గోదావరి వరదల నేపథ్యంలో నాలుగు నెలలు ఇసుక కొరత రాకుండా ఉండేలా ముందు జాగ్రత్త చర్యగా ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు.