Deputy CM Pawan: పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా ఏపీ ప్రభుత్వం అప్ గ్రేడ్ చేసింది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడం అని తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలు చేస్తే యాక్షన్ తీసుకుంటాం అని పేర్కొన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.
Read Also: Cyber Fraud: కొత్తపేటలో ఘరానా మోసం.. రూ. 30 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు..
ఇక, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సారథ్యంలో పిఠాపురం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుంది అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేశాం.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి పని చేస్తున్నాం అని వెల్లడించారు.