CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు యోగాంధ్ర తీర్మానం ప్రవేశ పెట్టారు. రెండు నిమిషాలు మౌనంగా మెడిటేషన్ చేసి తీర్మానాన్ని బలపరచమని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెక్నాలజీ యుగంలో ఉన్నాం.. వత్తిడితో ఉన్నాం.. గత ఐదేళ్లలో పార్టీ కార్యకర్తలు ఎంతో ఇబ్బంది పడ్డారు అని తెలిపారు.
దేశంలో మరోసారి రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 19న అస్సాం, తమిళనాడులో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. అస్సాంలో రెండు, తమిళనాడులో ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ప్రధాని నరేంద్ర మోడీ ఓట్లు కోసం చూడరని, దేశ అభివృద్ధి కోసమే యోచిస్తారు అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. హిమాలయ పర్వతాలు ఎలా తలవంచవో ప్రధాని సైతం ఎక్కడా తలవంచరన్నారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా మన దేశ శక్తిసామర్థ్యాలను చాటిన ఘనత ప్రధానిదే అని స్పష్టం చేశారు. ‘పీఎం-జన్ మన్’ ద్వారా మారుమూల గిరిజన ఆవాసాలకు రోడ్లు నిర్మిస్తున్నామని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రూ.555.61 కోట్లతో రోడ్లు చేపట్టాము అని డిప్యూటీ సీఎం…
NDA CMs and Deputy CMs Meeting: నేడు ఎన్డీయే కూటమికి చెందిన ముఖ్యమంత్రుల, డిప్యూటీ సీఎంల కీలక సమావేశం జరగనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ మీటింగ్ జరగనుంది.
GVMC డిప్యూటీ మేయర్ పదవిని పోరాడి సాధించింది జనసేన పార్టీ.. గంగవరం కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి పేరును డిప్యూటీ మేయర్‌గా ఖరారు చేసింది జనసేన అధిష్టానం.. అయితే, జనసేన డిప్యూటీ మేయర్ పదవిని దక్కించుకున్నా.. ఇప్పుడు కూటమిలో కొత్త వివాదం మొదలైంది..
IAS, IPS Officers Transfer: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ వారంలో బదిలీల ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది.
గతంలో రెండు సందర్భాల్లో మంత్రి నారా లోకేష్ ను ఢిల్లీకి రమ్మని ఆహ్వానించారు ప్రధాని మోడీ.. దీంతో, ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ అడిగారట లోకేష్.. ఇక, ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ ఖరారు కావడంతో.. హస్తినబాట పట్టనున్నారు.. రేపు సాయంత్రం కలవాలని ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో.. రేపు ప్రధాని మోడీతో నారా లోకేష్ సమావేశం అవుతున్నారు..
BJP: అస్సాం అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ చేసింది. దాదాపుగా రాష్ట్రంలోని అన్ని స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది.
పంచాయతీరాజ్ శాఖ గ్రామ పంచాయతీ పరిధిలోని భారత రక్షణ దళాల సిబ్బందికి చెందిన ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయింపు మంజూరు చేయాలని ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.. ఈ నిర్ణయం మన దేశ భద్రత కోసం తమ జీవితాలను అంకితం చేసే మన రక్షణ దళాలు, సైన్యం, నౌకాదళం, వైమానిక దళం, పారామిలిటరీ, CRPF సిబ్బంది యొక్క అచంచల ధైర్యాన్ని గౌరవిస్తుందన్నారు.
AP Govt: గత ప్రభుత్వ హయాంలో నిలిపివేసిన ఎన్టీఆర్ బేబీ కిట్ల పథకాన్ని ఎన్డీయే కూటమి ప్రభుత్వం పునరుద్ధరించింది. రూ. 1,410తో 11 వస్తువులను బేబీ కిట్ ద్వారా పంపిణీ చేయనున్న ఏపీ సర్కార్. రాష్ట్ర బడ్జెట్ నుంచి ఖర్చు చేయాలన్న ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు.