భారత ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ వేడుక రేపు (జూన్ 9) రాత్రి 7:15 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో జరగబోతుంది. ప్రధానితో పాటే కొత్త మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేయనుంది. ఈ కార్యక్రమానికి సామాన్యుల నుంచి మొదలుకుని విదేశీ అతిథులు హాజరుకాబోతున్నారు.
కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వరకూ ఎలాంటి అనుమానం లేదు.. కానీ ఆ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ ఎన్నాళ్లు నడుపుతారు అనేది మాత్రం ఊహించలేమని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ చెప్పుకొచ్చారు.
18వ లోక్‌సభ తొలి సమావేశాలు జూన్ 15 నుంచి 22వ తేదీ వరకు జరిగే ఛాన్స్ ఉందని శుక్రవారం ఈ సమాచారాన్ని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారాలతో ఈ నెల మూడో వారంలో సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయని పేర్కొన్నాయి. ప్రమాణ స్వీకారాలు రెండ్రోజుల పాటు జరిగే అవకాశం ఉంది.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నగీనా రిజర్వ్‌డ్ సీటు నుంచి ఎంపీగా గెలిచిన ఏఎస్పీ అధినేత చంద్రశేఖర్.. ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజల కోసం పోరాడతానని స్పష్టం చేశారు. బీజేపీని అడ్డుకునేందుకు తాను ఏం చేయగలిగితే అది శక్తివంతంగా చేశానని అన్నారు.
ఈ లోక్ సభ ఎన్నికల ఫలితాలు.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ప్రజలు తిరస్కరించినట్లు కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ ఆరోపించారు. అందుకే నరేంద్ర మోడీ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించొద్దని వ్యాఖ్యానించారు.
మూడోసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టేందుకు రెడీ అవుతున్నారు. ఆయన ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయింది. జూన్ 9వ తేదీన సాయంత్రం 6 గంటలకు మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.
కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు కొనసాగుతున్న వేళ బీజేపీ అగ్రనేతలు సమావేశమయ్యారు. కేంద్ర మంత్రివర్గ కూర్పు, కూటమి పక్షాలతో సమన్వయంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో చర్చిస్తున్నారు.