బీహార్ ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. అధికార-ప్రతిపక్ష కూటమిలు నువ్వానేనా? అన్నట్టుగా ఫైటింగ్ చేస్తు్న్నాయి. విమర్శలు-ప్రతి విమర్శలతో వేడి పెంచుతున్నారు. ప్రధాని మోడీ శుక్రవారం.. విపక్ష కూటమి లక్ష్యంగా విమర్శలు గుప్పించగా... తాజాగా ప్రధాని మోడీని టార్గెట్‌గా లాలూ ప్రసాద్ యాదవ్ ప్రతి దాడికి దిగారు.
Deputy CM Pawan: పులివెందుల, ఒంటిమిట్ట మండలాల్లో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ రెండు మండలాల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో పోటీ జరగడం ద్వారా ప్రజా తీర్పు వెలువడిందని అన్నారు.
Minister Savitha: కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో విజయంపై మంత్రి సవిత మాట్లాడుతూ.. గతంలో కడపలో ఏడు ఎమ్మెల్యే సీట్లు గెలిచి తెలుగుదేశం పార్టీ అడ్డా అనిపించుకున్నాం.. ఇప్పుడు పులివెందుల కూడా విజయం సాధించి టీడీపీకి కంచుకోటగా మారబోతుంది అన్నారు.
Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో బీజేపీ వ్యూహం ఎలా ఉంది? ఏపీలో పొత్తులున్నా... తెలంగాణలో మాత్రం మేం సింగిల్ అంటున్న కమల నేతలు... జూబ్లీహిల్స్‌లో కూడా అదే స్టాండ్ తీసుకుంటారా? అక్కడ బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ పరిస్థితి ఏంటి? అసలు తెలంగాణలో టీడీపీని ఎందుకు వద్దనుకుంటోంది కాషాయ పార్టీ? లెక్కల్లో ఎక్కడ తేడా కొడుతోంది?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్డీఏకు గట్టి షాక్ తగిలింది. అన్నాడీఎంకే మాజీ నేత, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఎన్డీఏ కూటమికి గుడ్‌బై చెప్పారు. గురువారం ఉదయం ముఖ్యమంత్రి స్టాలిన్‌తో పన్నీర్ సెల్వం మార్నింగ్ వాక్ చేశారు.
Dharmana Prasada Rao: చంద్రబాబు మ్యానిఫేస్టో అమలు చేయడని మన అందరికి తెలుసు అని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. ఆ విషయం కార్యకర్తలు ప్రజలకు చెప్పాలి.. ప్రతిపక్షంలో ఉన్నవారు.. ప్రజలకు లోపాలను ఎత్తి చూపడానికి ప్రయత్నించాలి..
CM Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురువారం (జూన్ 269న) బీజేపీ- ఏఐఏడిఎంకేలపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. మతం ప్రమాదంలో ఉందని పదే పదే చెబుతూ రాష్ట్ర ప్రజలను విభజించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార-ప్రతిపక్షాలు అధికారం కోసం వ్యూహాలు-ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఇక నటుడు విజయ్ కొత్త పార్టీ స్థాపించారు. టీవీకే (తమిళగ వెట్రి కళంగం) పార్టీ కూడా ఈసారి ఎన్నికల కదనరంగంలోకి దిగుతోంది.
NDA Corporators: గ్రేటర్ విశాఖ మేయర్ పదవిని గెలిచి సీఎం చంద్రబాబుకి పుట్టినరోజు కానుకగా ఇచ్చామని కూటమి కార్పొరేటర్లు పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీన డిప్యూటీ మేయర్ పై జరిగే అవిశ్వాస తీర్మానాన్ని కూడా మేమే గెలుచుకుంటాం అని ధీమా వ్యక్తం చేశారు.