ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నగీనా రిజర్వ్‌డ్ సీటు నుంచి ఎంపీగా గెలిచిన ఏఎస్పీ అధినేత చంద్రశేఖర్.. ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజల కోసం పోరాడతానని స్పష్టం చేశారు. బీజేపీని అడ్డుకునేందుకు తాను ఏం చేయగలిగితే అది శక్తివంతంగా చేశానని అన్నారు. నగీనాలో ఇప్పుడు కుదిరిన కూటమిని రాష్ట్రమంతటికీ తీసుకెళ్లడం ఖాయం అని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలిసారిగా చుట్మల్‌పూర్‌లోని తన ఇంటికి ఆయన చేరుకున్నారు. ఇక, 2022లో బెహెన్‌జీని ముఖ్యమంత్రిని చేయాలని సమాజం చెప్పింది.. కానీ బీజేపీని అడ్డుకునేందుకు బహుజన్ సమాజ్ పార్టీ ఎలాంటి ప్రయత్నం చేయలేదని విమర్శించారు.
Read Also: Kangana Ranaut: నేను మీలాగా కాదు.. చెంపదెబ్బ ఘటనపై పోస్టు డిలీట్ చేసిన కంగనా!
ఇక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 20 స్థానాల్లో బీజేపీ విజయాన్ని ఆపేందుకు ప్రజలు తనకు సహకరించిందని ఏఎస్పీ అధినేత చంద్రశేఖర్ పేర్కొన్నారు. దళితులు, ముస్లింలు, వెనుకబడిన వర్గాలు, రైతులు తమపై పెట్టుకున్న నమ్మకం వమ్ముకాదు అని తెలిపారు. ఎక్కడ బలహీన వర్గాల ప్రజలు అణచివేతకు గురౌతారో అక్కడ నేను ఉంటాను అని చెప్పారు. యూపీలో 2027లో రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. ప్రతిపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయినా తాను ప్రతిపక్ష పాత్రలోనే ఉంటానని చెప్పారు. దేశంలో ఎక్కడైనా అణిచివేత జరిగితే పార్లమెంట్‌లో పోరాటం చేస్తానని చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు.