Parliament Sessions: 18వ లోక్‌సభ తొలి సమావేశాలు జూన్ 15 నుంచి 22వ తేదీ వరకు జరిగే ఛాన్స్ ఉందని శుక్రవారం ఈ సమాచారాన్ని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారాలతో ఈ నెల మూడో వారంలో సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయని పేర్కొన్నాయి. ప్రమాణ స్వీకారాలు రెండ్రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక ఉంటుందని వెల్లడించాయి. అనంతరం రోజు రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సమావేశాలు జరుగుతుండగానే తొలి సెషన్ ముగింపుపై కొత్తగా ఎంపికైన మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నాయి. ఈ పార్లమెంట్ సెషన్స్ ల్లో భాగంగా ప్రధాన మంత్రి తన కేబినెట్‌ను ఉభయ సభలకు పరిచయం చేయనున్నారని సమాచారం.
Read Also: Big Breaking: Ramoji Rao : రామోజీ రావు కన్నుమూత!!
ఇక, రేపు (ఆదివారం) భారత ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కొత్త మంత్రివర్గ సమావేశం జరిగే అవకాశం ఉందని సంబంధిత అధికారులు చెప్పుకొచ్చారు. కేంద్ర మంత్రివర్గం సిఫారసు మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూన్ 5న 17వ లోక్‌సభను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక, ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 293 సీట్లు రాగా, బీజేపీకి సొంతంగా 240 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించింది.