Amit Shah: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కాసేపట్లో తమిళనాడు పర్యటనకు వెళ్లనున్నారు. ఇక, ఈ సందర్భంగా రాష్ట్రంలో తర్వలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు.
కూటమి లో గ్యాప్ ఉంది అనేది కేవలం దుష్ప్రచారం మాత్రమే అని ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. ధర్మవరంలో కూడా పార్టీల మధ్య కూడా ఇటువంటి గ్యాప్ లేదు.. కేవలం క్షేత్రస్థాయిలో కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయని పేర్కొన్నారు.
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికలో కొనసాగుతోన్న ఉత్కంఠకు తెరపడింది.. విజయం మీదా..? మాదా? అనే ఉత్కంఠగా సాగిన ఈ పోరులో చివరకు తిరుపతి డిప్యూటీ మేయర్ పోస్టును తెలుగుదేశం పార్టీ-జనసేన పార్టీ-భారతీయ జనతా పార్టీ కూటమి కైవసం చేసుకుంది..
Jamili Elections: భారతదేశంలో జమిలి ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్లులకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది. దీంతో ఈనెల 16వ తేదీన లోక్‌సభ ముందుకు వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లు వెళ్లబోతుందని అధికారిక వర్గాలు చెప్పుకొచ్చాయి.
తెలంగాణ, కర్ణాటక నుంచి కాంగ్రెస్ నేతలు తీసుకెళ్లిన డబ్బు సంచులు మహారాష్ట్ర ఎన్నికల్లో పనిచేయలేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. మహాయుతి కూటమి అభివృద్ధి మంత్రాలకే మహారాష్ట్ర ప్రజలు పట్టం కట్టారని మంత్రి పేర్కొన్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేసినా.. మహారాష్ట్రలో కాంగ్రెస్‌ను ప్రజలు చీదరించుకున్నారని అన్నారు.
పంచకర్ల రమేష్ బాబు...! గండి బాబ్జీ...! కూటమి పార్టీల్లో సీనియర్ నేతలు...కేరాఫ్ పెందుర్తి. ఒకరు సిట్టింగ్ ఎమ్మెల్యే అయితే మరొకరు మాజీ శాసనసభ్యుడు. ఎన్నికల సమయంలో కలిసి వుంటే కలదు సుఖం అని డ్యూయెట్లు పాడుకున్న ఈ నేతల మధ్య ఇప్పుడు కోల్డ్ వార్ జరుగుతోందని జనసేన, టీడీపీ కేడరే తెగ చెవులు కొరికేసుకుంటోంది.
CM Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండో రోజు ఢిల్లీలో బిజీబిజీగా పర్యటిస్తున్నారు. కాసేపట్లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్రమంత్రులతో సమావేశం కానున్నారు.
Vizag MLC Election: విశాఖపట్నంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోటీపై కూటమి నేతల కీలక సమావేశం అయింది. ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించనున్న అధిష్ఠానం నియమించిన కమిటీ.. ఆరుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన నివేదిక ఆధారంగా పోటీపై ఎన్డీయే కూటమి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.