PM Modi Praises pawan Kalyan: ఎన్డీఏ సమావేశంలో పవన్ కల్యాణ్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు ప్రధాని నరేంద్ర మోడీ. అందరి ఎన్డీయే నేతల సమక్షంలో జనసేన అధినేత పవన్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోడీ మాట్లాడుతూ.. “మన సమక్షంలోనే పవన్ కల్యాణ్ ఉన్నారు.. పవన్ కల్యాణ్ అంటే ఒక సునామీ.. పవన్ అంటే పవనం కాదు.. ఒక సునామీ.” అంటూ మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి ఏపీ ప్రజలు సంపూర్ణ మద్దతు పలికారన్నారు. చంద్రబాబుతో కలిసి చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నామని ప్రశంసించారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ పేరును ప్రస్తావించారు. ఆ వ్యక్తి తుఫాన్ అంటూ కొనియాడారు. ఏపీలో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి గెలుపు ప్రజల ఆకాంక్షలకు నిదర్శనమన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏపీలో ఎన్డీయే కూటమి భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 135, జనసేన 21, వైఎస్సార్‌సీపీ 11, బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తిస్థాయి మెజార్టీ సాధించింది టీడీపీ. ఈ నేపథ్యంలో 12వ తేదీన చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.