Huge Celebrations at NTR Bhavan: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) సునామీ సృష్టిస్తోంది. ఆధిక్యాల్లో మ్యాజిక్ ఫిగర్ (88)ను ఇప్పటికే దాటేసింది. ఇప్పటి వరకు టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు 150కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలి రౌండ్ నుంచే ఎన్డీఏ కూటమి అభ్యర్థులు పూర్తిస్థాయిలో ఆధిపత్యాన్ని కనబర్చారు. కూటమి ఘన విజయం దిశగా దూసుకెళుతుండడంతో.. కార్యకర్తలు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయానికి పార్టీ…
NDA Alliance Lead in 105 Seats in AP: 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి (టీడీపీ, బీజేపీ, జనసేన) దూసుకుపోతోంది. కూటమి అభ్యర్థులు లీడ్‌లో కొనసాగుతున్నారు. ఇప్పటికే ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ (88)ను దాటేసింది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటికే 105 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇలానే కొనసాగితే కూటమి భారీ మెజారిటీ సాధిస్తుంది. ఏపీలో మొత్తం అసెంబ్లీ సీట్లు 175 కాగా.. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి…
సజ్జల మాట్లాడుతూ.. చంద్రబాబు అడ్డదారిలో పట్టు నిలుపుకోవాలి అనుకుంటున్నారు. ఈసీ, ఎన్డీయే కూటమి ఏ విధంగా అన్యాయంగా వ్యవహరిస్తుందో అందరికీ తెలుసు అన్నారు. ప్రజా తీర్పు వైసీపీకి అనుకుంలాగా ఉంది.. పోస్టల్ బ్యాలెట్ విషయంలో గందరగోళానికి గురి చేస్తున్నారు జాగ్రత్తగా చూడాలి అని సూచించారు.
విజయనగరం ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారిని మాజీ మంత్రి, జనసేన నేత కొణతాల రామకృష్ణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కొణతాల మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఆశించిన ఫలితం రాబోతుంది.. పరిపాలన దక్షత కలిగిన చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారని పేర్కొన్నారు. బీజేపీ, టీడీపీనీ కలపడంతో జనసేన సఫలీ కృతమైంది.
తెలుగుదేశం- జనసేన- బీజేపీ కూటమికి విజ్ఞప్తి అంటూ కాపు బలిజ సంక్షేమ సేవ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరి రామజోగయ్య లేఖ రాశారు. కూటమి మేనిఫెస్టో ప్రజలకు ఆమోదయోగ్యంగానే ఉన్నందుకు సంతోషిస్తున్నామని తెలిపారు. అలాగే కొన్ని సవరణలు చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. బీసీలకు ప్రతిపాదించిన పెన్షన్ల వయోపరిమితి 50 సంవత్సరాలు అర్హులైన అన్ని కులాలకు వర్తింపజేయాలని కోరారు. బీసీలకు మాత్రమే ప్రతిపాదించిన రూ. 4 వేల పెన్షన్ అర్హులైన అన్ని కులాలకు వర్తింప చేయాలన్నారు.
తిరుపతిలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు పర్యటించారు. సోమవారం నామినేషన్ వేసిన ఆయన.. ఈరోజు తిరుమలకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నామినేషన్ వేసి ఆనవాయితీ ప్రకారం శ్రీవారి ఆశీస్సులు కోసం వచ్చానన్నారు. చంద్రగిరి ప్రాంతాన్ని కొందరు చందనగిరిగా మార్చారని తెలిపారు. చంద్రగిరి అభివృద్ధి కోసం ప్రజలు టీడీపీ అభ్యర్థి నానిని గెలిపించాలని పేర్కొన్నారు. చంద్రబాబులానే భారీ మెజారిటీతో నాని చంద్రగిరి ప్రజలు గెలిపించాలని కోరారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల భేటీ ముగిసింది. సుమారు రెండు గంటల సేపు సాగిన ఎన్డీఏ కూటమి నేతల సమావేశం.. ఎన్నికల కోడ్ వచ్చినా మారని కొందరి అధికారుల పని తీరు మీదే ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఎన్డీఏ కూటమి నేతల భేటీలో ఒకట్రొండు స్థానాల్లో మార్పు చేర్పులపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. అనపర్తి, ఉండి, తంబళ్లపల్లె, లాంటి స్థానాల్లో మార్పు చేర్పులపై ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తుంది.
వర ప్రసాదరావు మాట్లాడుతూ.. వైసీపీకి ఆదరణ లేనప్పుడు కష్టకాలంలో పార్టీలో చేరాన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేరలేదు.. ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవికి రాజీనామా చేశాను.. దళితుడి నాయకత్వాన్ని ఓర్చుకోలేక సీఎం కుట్ర చేశారు అని ఆయన ఆరోపించారు.
ప్రజా మేనిఫెస్టోపై ఎన్డీఏ నేతలు సమావేశం అయింది. ప్రజా మేనిఫెస్టో రూప కల్పనకు ప్రజాభిప్రాయం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజా అభిప్రాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు (7 ఏప్రిల్ 2024) బీహార్‌లో పర్యటించనున్నారు. ఇక, బీజేపీ అభ్యర్థి వివేక్ ఠాకూర్‌కు మద్దుతుగా ప్రచారం చేయబోతున్నారు. అలాగే, నవాడాలో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు.