Vizag MLC Election: విశాఖపట్నంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోటీపై కూటమి నేతల కీలక సమావేశం అయింది. ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించనున్న
అధిష్ఠానం నియమించిన కమిటీ.. ఆరుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన నివేదిక ఆధారంగా పోటీపై ఎన్డీయే కూటమి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఎమ్మెల్సీ పోటీపై కూటమి నేతల్లో ఏకాభిప్రాయం కొరవడింది. వైసీపీకి ఉన్న సంఖ్యా బలం ఆధారంగా పోటీ చేయకపోవడమే మంచిది అనే అభిప్రాయంలో కూటమిలోని సీనియర్లు ఉన్నట్లు సమాచారం.
Read Also: Bihar : బీహార్ లోని నదిలో మునిగిపోయిన పడవ.. 24మంది గల్లంతు
అయితే, ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవాలనే పట్టుదలతో ఏపీలోని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది. సార్వత్రిక ఎన్నికలో విజయం ఇచ్చిన జోష్ తో ఉన్న సమయంలో ఎమ్మెల్సీ ఫలితాలు తేడా వస్తే నెగటివ్ ఇంపాక్ట్ పడుతుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. నామినేషన్లకు రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. రేపు ( సోమవారం ) వైసీపీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్య నారాయణ నామినేషన్ దాఖలు చేయనున్నారు.