Tirupati Deputy Mayor Election: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఉత్కంఠకు తెర.. కూటమిదే విజయం..
- తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఉత్కంఠకు తెర..
- కూటమి ఖాతాల్లో తిరుపతి డిప్యూటీ మేయర్ పోస్టు..
- డిప్యూటీ మేయర్ గా ఆర్‌సీ మునికృష్ణా ఎన్నిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirupati Deputy Mayor Election: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికలో కొనసాగుతోన్న ఉత్కంఠకు తెరపడింది.. విజయం మీదా..? మాదా? అనే ఉత్కంఠగా సాగిన ఈ పోరులో చివరకు తిరుపతి డిప్యూటీ మేయర్ పోస్టును తెలుగుదేశం పార్టీ-జనసేన పార్టీ-భారతీయ జనతా పార్టీ కూటమి కైవసం చేసుకుంది.. నగర డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థినే గెలుపు వరించింది.. డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు కూటమి అభ్యర్థి ఆర్‌సీ మునికృష్ణా .. కూటమి అభ్యర్ది ఆర్‌సీ మునికృష్ణాకు మద్దతుగా చేతులెత్తారు 26 మంది కార్పొరేటర్లు.. మరోవైపు.. ఎలాగైనా తిరిగి ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలని విశ్వప్రయత్నాలు చేసిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఓటమి చవిచూడాల్సి వచ్చింది.. వైసీపీ అభ్యర్థి లడ్డూ భాస్కర్ రెడ్డికి 21 మంది కార్పొరేటర్లు మద్దతు పలికారు.. దీంతో.. కూటమి అభ్యర్థి ఆర్‌సీ మునికృష్ణా విజయం సాధించినట్టు అధికారులు ప్రకటించారు..
Read Also: Prithviraj Sukumaran: ప్రభాస్ గురించి అసలు నిజం బయటపెట్టిన పృథ్వీరాజ్ సుకుమారన్
Also Read
- Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
- Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
- 200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
కాగా, తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక సమయంలో.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం కిడ్నాప్‌నకు గురయ్యారనే పుకార్లు షికారు చేశాయి.. అయితే, కిడ్నాప్ వార్తలపై స్పందించిన ఎమ్మెల్సీ.. క్లారిటీ ఇచ్చారు.. నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు అంటూ ఓ వీడియో విడుదల చేశారు.. అనారోగ్యంగా కారణంగా.. ఆస్పత్రిలో చేరినట్టు తెలిపారు.. ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాను.. వైద్యులు డిశ్చార్జ్ చేయగానే వస్తాను.. అయితే, నా ఆరోగ్యం గురించి గానీ, నేను కిడ్నాప్‌నకు గురయ్యాననే వార్తలపై గానీ, ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.. తాను ప్రస్తుతం బాగానే ఉన్నానని.. ప్రజలు, అధికారులు, మీడియాకు విడుదల చేసిన ఆ వీడియోలో పేర్కొన్నారు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం..అయితే, షెడ్యూల్ ప్రకారం నిన్నే ఎన్నిక జరగాల్సిన ఉన్నా.. ఇవాళ్టికి వాయిదా పడింది.. ఇదే సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం అదృశ్యమయ్యారని.. గత అర్థరాత్రి నుంచి అతను కనిపించకుండా పోయారని, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉందని అతని అనుచరులు ఆందోళన వ్యక్తం చేశారు.. ఈ నేపథ్యంలో వీడియో విడుదల చేసి క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం.. డిప్యూటీ మేయర్ పదవిని చేజిక్కించుకునేందుకు మ్యాజిక్ ఫిగర్ 25గా ఉంది.. నిన్నటి రోజున ఎన్నికల కేంద్రానికి వస్తున్న వైసీపీ కార్పొరేటర్లలో నలుగురు అదృశ్యం… టీడీపీ నేతలు.. నలుగురు వైసీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారనే ఆరోపణలు తీవ్ర కలకలం సృష్టించాయి.. అయితే, తాము క్షేమంగానే ఉన్నామని, గొడవలు చూసి భయపడి వచ్చేశామని సెల్ఫీ వీడియోలు విడుదల చేశారు నలుగురు వైసీపీ కార్పొరేటర్లు.. మరోవైపు, తమ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారంటూ నిన్న మధ్యాహ్నం హైకోర్టును ఆశ్రయించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. అదృశ్యమైన నలుగురు కార్పొరేటర్ లను భారీ భద్రత నడుమ ఎన్నికల కేంద్రానికి తీసుకురావాలని పోలీసులను ఆదేశించింది హైకోర్టు.. అయితే, మొత్తంగా డిప్యూటీ మేయర్ ఎన్నికతో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌లో ఉత్కంఠకు తెరపడింది..
తాజావార్తలు
-
DJ Noise: వినాయకుడి పండుగలో ఈ భారీ శబ్దాలు ఎందుకు..? డీజే భక్తికి నేలకొరుగుతున్న ప్రాణాలు
-
Bank Holidays & Strike 2026: సెప్టెంబర్ 26 నుంచి వరుసగా బ్యాంకులకు సెలవులు.. 28 నుంచి 3 రోజుల సమ్మె
-
Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
-
Itlu Arjuna Teaser: మాటల్లేవ్… మాట్లాడుకోవడాలు లేవ్… డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
ట్రెండింగ్
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..