ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో 19 మంది నక్సలైట్లు లొంగిపోయారు. వీరిలో 9 మందిపై మొత్తం రూ. 28 లక్షల రివార్డు ఉంది. పోలీసు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సీనియర్ అధికారుల ముందు వీరు లొంగిపోయారు.
దేశంలో నక్సలిజాన్ని రూపుమాపేందుకు.. మావోయిస్టులను ఏరివేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. గత కొన్ని రోజుల క్రితం ఛత్తీస్ గఢ్ లో భద్రతా బలగాలు పలువురు మావోలను మట్టుబెట్టారు. తాజాగా మరో ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భద్రతా దళాలకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సలైట్లు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రతా దళాలు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నప్పుడు ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలిపారు. Also Read:CM…
ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నది ప్రాంతంలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బాలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కాల్పులు జరిగాయి. డీఆర్‌జీ అండ్ ఎస్టీఎఫ్ బస్తర్ ఫైటర్లు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగాయి. ఉదయం నుండి ఈ ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 31 మంది మావోయిస్టులు, ఇద్దరు జవాన్లు చనిపోయారు.
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో తొమ్మిది మంది పేరుమోసిన నక్సలైట్లు శనివారం లొంగిపోయారు. వీరంతా భద్రతా బలగాలపై అనేక దాడులకు పాల్పడ్డారు. ఈ నక్సలైట్లకు ఒక్కొక్కరికి రూ.25 వేలు ఇచ్చి ప్రభుత్వ విధానం ప్రకారం.. పునరావాసం కల్పిస్తారు. గతేడాది బస్తర్ ప్రాంతంలో 792 మంది నక్సలైట్లు లొంగిపోయారు. సుక్మాతో సహా ఏడు జిల్లాలు ఈ ప్రాంతంలో వస్తాయి.
ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో నక్సలైట్ల దాడిలో 8 మంది డీఆర్‌జీ జవాన్లు వీరమరణం పొందారు. ఈ జవాన్లకు మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో సైనికులకు అంతిమ వీడ్కోలు పలికారు. వారి త్యాగానికి నివాళులు అర్పించి, వారి త్యాగం వృథా కాకుండా చూస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి పచ్చని అడవి రక్తసిక్తమైంది. తుపాకీ శబ్ధాలతో దద్దరిల్లింది. భద్రతా దళాలకు-మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో భారీగా మావోయిస్టులు హతమైనట్లుగా తెలుస్తోంది.
ఛత్తీస్‌గఢ్‌లో బీజాపూర్ జిల్లాలోని పోలీస్ బేస్ క్యాంపుపై నక్సలైట్లు మరోసారి దాడి చేశారు. గత మూడు రోజుల్లో నక్సలైట్లు పోలీసులపై దాడి చేయడం ఇది రెండోసారి. పోలీసు శిబిరంలో కాల్పులు జరిగినట్లు బీజాపూర్ ఎస్పీ డాక్టర్ జితేంద్ర యాదవ్ ధృవీకరించారు. పామేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడపల్లి పోలీస్ క్యాంపుపై నక్సలైట్లు దాడి చేశారు.. పోలీసులు, నక్సలైట్ల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు జవాన్లకు స్వల్ప గాయాలయ్యాయి. బేస్ క్యాంపులో సైనికులకు ప్రథమ చికిత్స చేస్తున్నారు. ఈ…
Massive Encounter: ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు- మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురు కాల్పులు చోటు చేసుకుంది. సుమారు 10 మంది మావోలు మృతి చెందినట్లు సమాచారం.
ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులోని మాద్ ప్రాంతంలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతోంది. ఎన్‌కౌంటర్‌ను పోలీసు సూపరింటెండెంట్ ఐకె ఎలిసెలా ధృవీకరించారు. కోర్ ఏరియా కావడంతో సైనికులు సంప్రదించలేకపోతున్నారు. కంకేర్ నక్సలైట్ ఎన్‌కౌంటర్‌లో చాలా మంది నక్సలైట్లు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇది అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఘటనా స్థలం నుంచి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్ కౌంటర్ కొనసాగుతోంది.
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో 11 మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఘటనను ఐజీ సుందర్‌రాజ్ వెల్లడించారు.