Massive Encounter: ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు- మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురు కాల్పులు చోటు చేసుకుంది. సుమారు 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. సుక్మా జిల్లా కుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని బజ్జి అటవీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. కాగా, ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలను భద్రత బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈరోజు (శుక్రవారం) ఉదయం నుంచి ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఇక, ఘటన స్థలానికి అదనపు బలగాలు భారీగా మోహరిస్తున్నాయి.
Read Also: Manish Sisodia: లిక్కర్ కేసులో సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఢిల్లి మాజీ డిప్యూటీ సిఎం
అయితే, ఒడిశా సరిహద్దుల నుంచి ఛత్తీస్‌గఢ్‌లోకి మావోయిస్టులు ప్రవేశించినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో.. సౌత్ సుక్మా ప్రాంతంలో డీఆర్‌జీ బృందం ఈరోజు (శుక్రవారం) తెల్లవారుజామున గాలింపు చేపట్టింది. దండకారణ్యంలో మావోలు నక్కిన ప్రాంతాన్ని గుర్తించి చుట్టుముట్టేశారు. భద్రతా బలగాలను చూసి నక్సల్స్ వారిపై కాల్పులు జరిపగా.. అలర్టైన భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులకు దిగింది. ఇప్పటి వరకు పది మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలంలో INSAS, AK-47, SLR సహా పలు ఆయుధాలను హస్తగతం చేసుకున్నట్లు వెల్లడించారు. మృతుల్లో మావోయిస్టుల అగ్రనాయకులు ఉన్నట్లు సమాచారం.
అలాగే, ఇంకా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. సుక్మా జిల్లాలోని బెజ్జి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొరాజుగూడ, దంతేస్‌పురం, నాగారం, భండార్ పదర్ గ్రామాల అటవీ-కొండల్లో డీఆర్జీ బృందం, నక్సలైట్ల ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది.