Chhattisgarh: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మరోసారి ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మరణించారు.
ఛత్తీస్ఘడ్ రాష్ట్రం కంకేర్‌లో పోలీసులు, నక్సలైట్ల మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరుగుతుంది. కంకేర్‌లోని ఛోటేబైథియా పోలీస్ స్టేషన్‌లోని కల్పర్ అడవుల్లో ఎన్‌కౌంటర్ జరుగుతుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో 18 మంది నక్సలైట్లు హతమైనట్లు వార్తలు వస్తున్నాయి. కాగా.. ఘటనా స్థలం నుంచి పోలీసులు ఏకే47తో పాటు ఇన్సాస్ రైఫిల్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.
Chhattisgarh: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టారు. ఛత్తీస్‌గఢ్ ఆర్మ్డ్ ఫోర్సెస్(సీఏఎఫ్) 4వ బెటాలియన్‌కి చెందిన తిజౌ రామ్ భూర్యను కిరాతకంగా చంపారు. ఇతను కంపెనీ కమాండర్‌గా పనిచేస్తు్న్నాడు. నక్సలైట్లు భూర్యపై గొడ్డలితో దాడి చేశారు. ఈ ఘటన తెలంగాణ సరిహద్దు జిల్లా అయిన బీజాపూర్‌లో చోటు చేసుకుంది.
త్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు మావోలు దుశ్చర్యకు పాల్పడ్డారు. రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత దంతెవాడ జిల్లాలో నక్సలైట్లు అమర్చిన ఐఈడీ పేలుడులో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు.
Chhatisgarh: ఛత్తీస్‌గఢ్‌లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్‌తో నక్సలైట్లు మళ్లీ తమ క్రియాశీలతను చాటుకున్నారు. నక్సలైట్లు ఒకదాని తర్వాత ఒకటిగా రెండు ఐడీ పేలుళ్లు చేశారు.
ఛత్తీస్గఢ్ లోని కాంకేర్ జిల్లాలో నక్సలైట్లు తమ ఉనికిని చాటుకుంటున్నారు. కట్టు దిట్టమైన పోలీసు బందోబస్తు ఉన్న.. భారీగా భద్రత బలగాలను మోహరించిన నక్సలైట్ల ఉనికిని అడ్డుకోలేకపోతున్నారు అక్కడి అధికారలు.
జార్ఖండ్‌లోని లతేహార్ జిల్లాలో అర్థరాత్రి నక్సలైట్లు బీభత్సం సృష్టించారు. జిల్లాలోని నెటార్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దావ్నా, పురందీ గ్రామాల్లో హల్ చల్ చేశారు. అంతేకాకుండా ఐదుగురిని పోలీస్ ఇన్‌ఫార్మర్లు అనే నెపంతో.. వారిని ఇంటి నుంచి తీసుకెళ్లారు.
ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లా ఏప్రిల్ 28న జవాన్ మనోజ్ నేతమ్ ,ను అపహరించుకు పోయిన మావోయిస్టులు,జవాన్ మనోజ్ ను హత్య చేసినట్లు ధృవీకరించారు.ఈ ఘటనకు సంబంధించి ఓ ప్రెస్ నోట్ ను విడుదల చేసారు.ఐతే మనోజ్ మృతదేహాన్ని అనివార్య కారణాల వల్ల కుటుంబ సభ్యులకు చేరవేయనందుకు చింతిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.ఐతే కరోనా మహమ్మారి దండకారణ్యం లో ఇప్పటికే విలయతాండవం చేస్తున్నదనే వార్తలు వస్తున్నాయి.పలు చోట్ల కరోనా చోకిన మావోలు చికిత్స కోసం మైదాన ప్రాంతానికి రావటం, కొంతమంది…