ఓ వైపు సముద్రం.. ఇంకోవైపు భారతమాత సైనికుల బలం తనతో ఉందని ప్రధాని మోడీ అన్నారు. గోవాలోని కార్వార్ తీరంలో ఐఎన్ఎస్ విక్రాంత్ దగ్గర సాయుధ దళాల సిబ్బందితో కలిసి మోడీ దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఆపరేషన్ సిందూర్ గుర్తుగా ఈ ఏడాది దీపావళి వేడుకలు నౌకాదళంతో జరుపుకున్నారు.
Rafale-M Jets: భారత నౌకాదళం చేతికి మరో అత్యాధునిక యుద్ధ విమానాలు రాబోతున్నాయి. 26 రఫేల్ మెరైన్ శ్రేణి విమానాలు కొనుగోలు చేసేందుకు ఫ్రాన్స్‌తో భారత్ ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ఇరు దేశాలకు చెందిన అధికారలు సమక్షంలో సంతకాలు జరిగాయి.
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రం దేశ రక్షణలో కీలక భూమిక పోషిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇవాళ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి డిఫెన్స్ ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, దేశ భద్రతకు తెలంగాణ రాష్ట్రం ఎంతో సహకారం అందిస్తోందని, ఇప్పటికే హైదరాబాద్ రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమలు, విభాగాలకు కేంద్రంగా మారిందని వెల్లడించారు. తెలంగాణలో డిఫెన్స్ పరిశ్రమలు విస్తృతంగా అభివృద్ధి…
విశాఖపట్నం తీరంలో జరిగిన నేవీ సన్నాహక విన్యాసాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. శనివారం (జనవరి 4) జరగనున్న నౌకాదళ వేడుకల సందర్భంగా.. అధికారులు గురువారం పూర్తిస్థాయి సన్నాహక విన్యాసాలు నిర్వహించారు. విమానాల నుంచి ప్యారాచూట్ల ద్వారా నావికులు దిగుతున్న క్రమంలో.. గాలి అనుకూలించకపోవడంతో రెండు ప్యారాచూట్ల ఒకదానికొకటి చిక్కుకున్నాయి. దీంతో పట్టుకోల్పోయిన ఇద్దరు నావికులు సముద్రంలో పడిపోయారు. అప్పటికే విశాఖ సముద్రంలో ఉన్న జెమినీ బోట్ల సిబ్బంది.. ఇద్దరు నావికులను రక్షించి ఒడ్డుకు చేర్చారు. నావికులు సురక్షితంగా బయటపడడంతో…
31 ప్రిడేటర్ డ్రోన్‌లను కొనుగోలు చేసేందుకు అమెరికాతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇరు దేశాల మధ్య ఈ ఒప్పందంపై ఇరు పక్షాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందానికి సంబంధించి ఇరు దేశాల మధ్య చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ డీల్ విలువ రూ.32 వేల కోట్లు.
Indian Navy : భారత నావికాదళంలోకి త్వరలో 7 కొత్త యుద్ధనౌకలు, ఒక జలాంతర్గామిని చేర్చబోతున్నారు. ఇది తన సముద్ర భద్రతను మరింత పటిష్టం చేసుకునే దిశగా భారతదేశం నుండి ఒక పెద్ద అడుగు అవుతుంది.
మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని రాజ్‌కోట్ కోటలో ఉన్న 35 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం సోమవారం బలమైన గాలులకు కూలిపోయింది. ఈ విగ్రహాన్ని గత ఏడాది (4 డిసెంబర్ 2023) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు.
బంగ్లాదేశ్‌ను వరదలు ముంచెత్తాయి. వరదల కారణంగా 13 మంది మరణించారు. 4.5 మిలియన్ల మంది ప్రజలు ముంపునకు గురయ్యారు. సహాయ బృందాలు రంగంలోకి దిగి పరిస్థితుల్ని చక్కదిద్దుతున్నారు.
Indian Navy : భారత నౌకాదళం మరోసారి తన బలాన్ని చాటుకుంది. శనివారం మెరైన్లు అరేబియా సముద్రం మధ్యలో MV Ruen షిప్ ని నిలిపివేసి మిడ్-సీ ఆపరేషన్ నిర్వహించారు.
Qatar frees 8 Navy veterans: గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన ఎనిమిది మంది మాజీ భారత నావికాదళ సిబ్బందిని ఖతార్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) సోమవారం తెల్లవారుజామున ఓ ప్రకటన విడుదల చేసింది. వీరికి విధించిన మరణశిక్షను ఇప్పటికే న్యాయస్థానం జైలు శిక్షగా మార్చగా.. తాజాగా దాని నుంచి విముక్తి కల్పించి భారత్‌కు అప్పగించారు. అల్ దహ్రా గ్లోబల్ కంపెనీలో పనిచేస్తున్న ఎనిమిది మంది మాజీ భారతీయ…