అదానీ గ్రూప్ తయారు చేసిన దృష్టి 10 ‘స్టార్‌లైనర్’ మానవరహిత వైమానిక వాహనం (UAV)ని భారత నావికాదళ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరి కుమార్ బుధవారం హైదరాబాద్ లోని అదానీ ఏరోస్పేస్‌లో ఆవిష్కరించారు. ఈ డ్రోన్లు భారత నౌకా దళ శక్తి సామర్థ్యాలను మరింత పెంపొందించేలా తయారు చేశారు. అంతేకాకుండా.. సముద్రంలో నిఘా కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. దృష్టి డ్రోన్లను ప్రత్యేకంగా డిజైన్ చేయించామని హరి కుమార్ వివరించారు. దృష్టి 10 ‘స్టార్‌లైనర్’ అనేది ఒక అధునాతన…
మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ మిషన్‌కు సంబంధించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కీలక పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు సంబంధించి ఇస్రో కీలక అప్‌డేట్ ఇచ్చింది.
తమిళనాడుకు చెందిన 9 మంది భారతీయ జాలర్లను శ్రీలంక నావికాదళం అదుపులోకి తీసుకుంది. సముద్ర సరిహద్దును ఉల్లంఘించినందుకు అరెస్ట్ చేశారని రాష్ట్ర మత్స్యశాఖ అధికారి ఒకరు మంగళవారం తెలిపారు. వారివద్ద నుంచి రెండు మెకనైజ్డ్ బోట్లను స్వాధీనం చేసుకున్నారు. రామనాథపురం జిల్లాలోని మండపానికి చెందిన మత్స్యకారులు సోమవారం ఉదయం చేపల వేటకు వెళ్లగా నిన్న అర్థరాత్రి కచ్చతీవు- నెడుంతీవు మధ్య వారిని అరెస్ట్ చేశారు.
అమెరికా నేవీకి నూతన అధిపతిగా లీసా ఫ్రాంచెట్టి పేరు తెరపైకి వచ్చింది. దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఆ పేరును ప్రతిపాదించారు. ఒకవేళ యూఎస్ సెనేట్ ఆ ప్రతిపాదనను సమర్ధిస్తే అడ్మిరల్ లీసా ఫ్రాంచెట్టి అమెరికా నావికా దళాధిపతిగా బాధ్యతలు స్వీకరించనుంది.
నౌకా దళం రాత్రిపూట సాహసం చేయడంతో రెండున్నరేళ్ల చిన్నారి బాలుడు రక్షించబడ్డాడు. రాత్రి వేళలో 500 కిలోమీటర్ల మేర విమానం నడిపి చిన్నారి బాలుడు ప్రాణాలు కాపాడటంలో తమ సహకారం అందించారు.
భారత్‌కు చెందిన మొట్టమొదటి విమాన వాహక నౌక ఓ చారిత్రక మైలురాయిని దాటింది. ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై తొలిసారి ఓ నౌకాదళ స్వదేశీ యుద్ధ విమానం ల్యాండ్ అయింది.
అగ్నిపథ్ పథకం ఇప్పుడు కాకరేపుతోంది.. ఓవైపు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు, బంద్‌లు కొనసాగుతుంటే.. మరోవైపు ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదన్నట్టుగా నోటిఫికేషన్లకు విడుదల చేస్తోంది కేంద్రం.. దేశవ్యాప్తంగా అగ్నిపథ్‌పై ఆందోళన నేపథ్యంలో ఇప్పటికే త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమావేశం నిర్వహించగా.. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ రంగంలోకి దిగారు.. రేపు అనగా మంగళవారం త్రివిధ దళాధిపతులతో సమావేశం కాబోతున్నారు ప్రధాని మోడీ.. కర్ణాటక పర్యటనలో అగ్నిపథ్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేసిన ఆయన.. కొన్ని…
దేశవ్యాప్తంగా అగ్నిపథ్ స్కీం మంటలు రాజేస్తోంది. ఈ పథకంపై విపక్షాలు, నిరుద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దేశ యువతకు ఉద్యోగాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకంపై నిరసనలు వెల్లువెత్తినా.. కేంద్రం వెనక్కి తగ్గే అవకాశం కనిపించడం లేదు. ఈ పథకంపై రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ త్రివిధ దళాల అధినేతలతో వరుసగా రెండో సారి భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం త్రివిధ దళాల అధిపతులు… అగ్నిపథ్ పథకంపై వెనకడుగు వేసే…