కేంద్ర బడ్జెట్ 2022-2023లో రక్షణ రంగానికి భారీగా నిధులను కేటాయించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సైనికదళాల అవసరాల కోసం కేంద్రం 5.25 లక్షల కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. మూలధన కేటాయింపులను 12.82 శాతంగా పెంచి రూ. 1.52 లక్షల కోట్లు కేటాయించారు. అయితే, ఈసారి వాయుసేన, ఆర్మీకంటే నేవీకి అధికంగా నిధులను కేటాయించారు. గతేడాది కంటే ఈసారి నేవీకి 43 శాతం మేర నిధులు పెరిగాయి. వాయుసేనకు 4.5 శాతం కేటాయింపుల్లో పెరుగుదల కనిపించగా, ఆర్మీకి…
దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. పరేడ్ కు ముఖ్య అతిథిగా ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి హాజరయ్యారు. శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్ల నుండి తొలి గౌరవం వందనాన్ని స్వీకరించారు ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి. శిక్షణ పూర్తి చేసుకున్న 208 మంది ఫ్లయింగ్ ఆఫీసర్లు,103 మంది గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్లు, నేవీ 2, కోస్ట్ గార్డ్ ఇద్దరిని ఆయన అభినందించారు. శిక్షణ పూర్తి చేసుకొని…
సీడీఎస్ బిపిన్ రావత్‌కు 17 తుపాకుల వందనం సమర్పిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. తుపాకుల వందనాల్లో అనేక రకాలు ఉన్నాయి. 21 తుపాకుల వందనం, 19 తుపాకుల వందనం, 17 తుపాకుల వందనం వంటివి అనేక రాకాలు ఉంటాయి. వివిధ సందర్బాలను బట్టి, గౌరవాన్ని బట్టి ఈ తుపాకుల వందనం ఉంటుంది. స్వాతంత్య్రదినోత్సవం, గణతంత్ర దినోత్సవంలో 21 తుపాకుల వందనాన్ని సమర్పిస్తారు. వీటి కోసం తుపాకులు లేదా శతఘ్నలను వినియోగిస్తారు. వివిధ దేశాలకు చెందిన అధ్యక్షులు మనదేశానికి…
భారీవర్షాలు, పొంగిపొర్లుతున్న వాగులు వంకలతో జనం గల్లంతవుతున్నారు. కడప జిల్లా చెయ్యేరు వరదలలో గల్లంతయిన వారి కోసం హెలికాప్టర్ తో గాలింపు చర్యలు చేపడుతున్నారు అధికారులు. గుండ్లూరు వద్ద వరద ప్రవాహంలో చిక్కుకున్న యువకుణ్ణి రక్షించింది నేవీ హెలికాప్టర్. పులపత్తురు శివాలయంలో పూజలకు వెళ్లి గల్లంతయిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. కార్తీకదీపం వెలిగించేందుకు వెళ్లి వరదల్లో గల్లంతయ్యారు. అందులో ఇద్దరు మహిళల మృతదేహాలు లభ్యం అయ్యాయి. చెయ్యేరులో కొట్టుకుపోతున్న మరో మృతదేహంని స్వాధీనం చేసుకున్నారు. చెయ్యేరు…