Earthquake: ఫిలిప్పీన్స్‌ను భూకంపాలు బయపెడుతున్నాయి. గత కాలంగా ఆ దేశంలో భూప్రకంపనలు కొనసాగుతున్నాయి. తాజాగా శుక్రవారం కూడా తెల్లవారుజామున మరోసారి ఫిలిప్పీన్స్ లో భూమి కంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ప్రకారం.. ఫిలిప్పీన్స్ లోని మిండానావో ప్రాంతంలో ఉదయం 7 గంటలకు 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం భూమికి 90 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైందని NCS తెలిపింది. ప్రస్తుతానికి ఈ ప్రకంపనల కారణంగా ఎటువంటి ప్రాణనష్టం కానీ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం…
ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎంతంటి విధ్వంసం జరుగుతుందో ఇలీవలి జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తే తెలిసిపోతుంది. నిన్న ఆఫ్ఘనిస్థాన్ లో భూకంపం కారణంగా వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇది మరువకముందే ఆఫ్రికన్ దేశమైన సూడాన్‌లో ప్రకృతి ఉగ్ర రూపందాల్చింది. సూడాన్ లో కొండచరియలు విరిగిపడి 1,000 మంది మరణించారని సూడాన్ లిబరేషన్ మూవ్‌మెంట్/ఆర్మీ తెలిపింది. ఈ కొండచరియ పశ్చిమ సూడాన్‌లోని మర్రా పర్వత ప్రాంతంలోని ఒక గ్రామాన్ని పూర్తిగా నాశనం చేసింది. గ్రామంలో ఒక్కరు మాత్రమే…
ISRO Satellite Images: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో గత వారంలో సంభవించిన క్లౌడ్ బ్రస్ట్ తరవాత అందుకు సంబంధించిన భయానక దృశ్యాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఉపగ్రహ చిత్రాలు బయటపెట్టింది. ఈ విపత్తు కారణంగా ధరాళీ గ్రామం దాదాపు పూర్తిగా నాశనం అయిందని ఈ చిత్రాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. గత ఏడాది జూన్‌లో తీసిన ఉపగ్రహ చిత్రాల్లో భగీరథి నది ఒడ్డున ఇళ్లతో, చిన్న తోటలతో, ఇతర నిర్మాణాలతో ఉన్న ఒక భూభాగం…
రైలు ప్రమాదం ఈ పేరు వింటేనే కొందరికి భయమేస్తోంది. ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడో ఒక చోట రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కొన్ని సాంకేతిక లోపాలు, తదితర కారణాల వల్ల రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద రైలు ప్రమాదం ఏదో తెలుసా? దాదాపు 1700 మందిని బలిగొన్న ఈ ప్రమాదం శ్రీలంకలో చోటు చేసుకుంది. 2004లో జరిగిన ఈ దుర్ఘటన ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది.
Pakistani Reporter: ప్రకృతి కన్నెర్ర చేస్తే మానవ శక్తి ఎంత చిన్నదో తెలియజేసే ఘటన తాజాగా పాకిస్తాన్ లో చోటుచేసుకుంది. అక్కడి రిపోర్టర్ ఒకరు వరద పరిస్థితిని కవర్ చేయడంలో అత్యుత్సాహం ప్రదర్శించి తన ప్రాణాన్ని కోల్పోయి పరిస్థితిని తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లలో పెద్ద చర్చకు దారి తీసింది. పాకిస్తాన్ లోని సింధ్ ప్రాంతంలో తాజాగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల తీవ్రతతో వరదలు అదుపుతప్పి జనజీవనాన్ని ముంచెత్తాయి.…
Storms Hit US: అమెరికాలో ఏర్పడిన తుపాన్ కెంటకీ, మిస్సోరీలో 25 మందిని బలి తీసుకున్నాయి. తాజాగా అధికారిక వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో అనేక ఇల్లు, ఆస్తులు ధ్వంసమయ్యాయని తెలిపారు. కెంటకీ గవర్నర్ ఆండీ బెషియర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని లారెల్ కౌంటీలో జరిగిన తుఫానులో 17 మంది మృతి చెందారు. ఇది లెక్సింగ్టన్‌కు దక్షిణంగా 80 మైళ్ల దూరంలో ఉంది. మరో ఒకరు పలాస్కీ కౌంటీలో మరణించారు. ఇది ఎంతో…
Earthquake: తెలంగాణలో పలుచోట్ల భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.2 నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో భూమి కంపించినట్లు సమాచారం అందుతోంది. ఈ భూ ప్రకంపనలు కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల సుల్తానాబాద్ లో వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్, కడెం, జన్నారంలో కూడా భూమి కనిపించినట్లు తెలుస్తోంది. భూమి ఒక్కసారిగా ప్రకంపించడంతో ఇళ్లలో నుంచి ప్రజలు బయటికి పరుగులు తీశారు. అయితే ఆస్థి,…
Argentina: అర్జెంటీనాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 16 మంది ప్రాణాలు కోల్పోగా, పలు మంది గల్లంతయ్యారు. అధికారుల ఇచ్చిన సమాచారం ప్రకారం.. అర్జెంటీనాలోని తూర్పు తీరంలోని బహియా బ్లాంకా నగరంలో వర్షాలు తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి. గత రెండు రోజుల క్రితం ప్రారంభమైన ఈ వర్షానికి వచ్చిన వరద నీటిలో అనేక మంది గల్లంతయ్యారు. ప్రభుత్వ అధికారులు వెంటనే రంగంలోకి దిగి, రాజధాని బ్యూనస్ అయర్స్‌కు దక్షిణంగా ఉన్న బహియా బ్లాంకా నగరం నుంచి 1,450…
Earthquake In Taiwan: తైవాన్ (Taiwan) దక్షిణ ప్రాంతంలో సోమవారం రాత్రి భారీ భూకంపం (Earthquake) సంభవించింది. యుజింగ్ జిల్లాలో (Yujing district) రాత్రి పలుమార్లు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు. భూకంప తీవ్రతకు భయాందోళన చెందిన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దక్షిణ తైవాన్‌లో సోమవారం రాత్రి మొదట 5.1 తీవ్రతతో…