Earthquake: తెలంగాణలో పలుచోట్ల భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.2 నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో భూమి కంపించినట్లు సమాచారం అందుతోంది. ఈ భూ ప్రకంపనలు కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల సుల్తానాబాద్ లో వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్, కడెం, జన్నారంలో కూడా భూమి కనిపించినట్లు తెలుస్తోంది. భూమి ఒక్కసారిగా ప్రకంపించడంతో ఇళ్లలో నుంచి ప్రజలు బయటికి పరుగులు తీశారు. అయితే ఆస్థి, ప్రాణ నష్టం లాంటి సంఘటనలు జరగలేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.