Pakistani Reporter: ప్రకృతి కన్నెర్ర చేస్తే మానవ శక్తి ఎంత చిన్నదో తెలియజేసే ఘటన తాజాగా పాకిస్తాన్ లో చోటుచేసుకుంది. అక్కడి రిపోర్టర్ ఒకరు వరద పరిస్థితిని కవర్ చేయడంలో అత్యుత్సాహం ప్రదర్శించి తన ప్రాణాన్ని కోల్పోయి పరిస్థితిని తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లలో పెద్ద చర్చకు దారి తీసింది. పాకిస్తాన్ లోని సింధ్ ప్రాంతంలో తాజాగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల తీవ్రతతో వరదలు అదుపుతప్పి జనజీవనాన్ని ముంచెత్తాయి. దీనితో అక్కడ మౌలిక సదుపాయాల్లేని పరిస్థితుల్లో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లు కొట్టుకుపోతుండగా, వంతెనలు కూలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక రిపోర్టర్ వరద ప్రాంతానికి వెళ్లి అక్కడి పరిస్థితిని రికార్డు చేయాలనుకున్నారు.
Louise Fischer: లైవ్ ఇంటర్వ్యూలో శృంగారంలో పాల్గొన్న రిపోర్టర్.. వీడియో వైరల్!
నిజానికి అతడు ఎటువంటి ప్రమాదమూ లేకుండా దూరం నుంచి కెమెరామెన్ సహాయంతో రిపోర్టింగ్ చేయడం చాలు. అయితే, ఈ రిపోర్టర్ మాత్రం అక్కడి పరిస్థితిని తక్కువ అంచనా వేశాడు. దానితో ఇంకేముంది.. తనకంటే ధైర్యంగా ఇంకెవ్వరూ లేరన్నట్టుగా నేరుగా వరద నీటిలోకి అడుగుపెట్టాడు. ఆలా వెళ్లిన అతడు కొన్ని సెకన్ల పాటు పట్టు నిలుపికి రిపోర్టింగ్ చేసాడు. అలా చేస్తున్న సమయంలో వరద ప్రవాహం పెరిగి చూస్తుండంగానే అతడిని ముంచేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ చాలా మంది ఆ రిపోర్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Ashok Gajapathi Raju: అప్పుడే గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం.. తేదీ ఫిక్స్ చేసిన అశోక్ గజపతిరాజు
⚡ A Pakistani reporter is swept away by strong currents during a live broadcast while covering the floods in neck-deep water. pic.twitter.com/psQsgDMsFI
— OSINT Updates (@OsintUpdates) July 17, 2025
ఇందులో కొందరు..రిపోర్టర్ ప్రాణం పోయిన తర్వాత అతని కుటుంబానికి ఎవరు అండగా ఉంటారు? అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరేమో.. రిపోర్టింగ్ చేయడం తప్పు కాదు, కానీ ప్రాణాల్ని పణంగా పెట్టి చేయాలిసిన అవసరం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.