UGC NET 2025 : యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) డిసెంబర్ 2024 సెషన్ పరీక్షలు దేశవ్యాప్తంగా పలు కేంద్రాలలో జరుగుతున్నాయి. జనవరి 3న ప్రారంభమైన ఈ పరీక్షలు జనవరి 16 వరకు కొనసాగనున్నాయి. అయితే, సంక్రాంతి పండుగ నేపథ్యంలో జనవరి 15న జరగవలసిన పరీక్షను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని ఎన్టీయే పేర్కొంది. జనవరి 16న నిర్వహించవలసిన పరీక్ష మాత్రం…
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్స్ 2025 పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్‌ను jeemain.nta.nic.in లేదా nta.ac.inలో చూడవచ్చు. షెడ్యూల్ ప్రకారం.. ఈ రోజు అక్టోబర్ 28 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు జేఈఈ మెయిన్స్ 2025 మొదటి సెషన్ కోసం నమోదు చేసుకోవచ్చు. నవంబర్ 22 రాత్రి 11:50 గంటల వరకు రిజిస్ట్రేషన్ లింక్ యాక్టివ్‌గా ఉంటుంది.
NEET UG 2024: మే 5వ తేదీన జరిగిన మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష నీట్-యూజీ 2024పై తీవ్ర దుమారం రేగింది. పేపర్ లీకేజీ వ్యవహారంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన అన్ని పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఇవాళ (సోమవారం) విచారణ జరపనుంది.
NEET Paper Leaks Case: నీట్, నెట్ పరీక్షల లీకేజీపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ నేడు దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి. పాఠశాలలు, కళాశాలల బంద్ చేయాలని కోరుతూ..
ప్రస్తుతం ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నిజానికి నీట్, నెట్ వంటి ముఖ్యమైన పరీక్షల్లో అక్రమాలు జరిగిన తర్వాత ఈ పరీక్షలను నిర్వహించే సంస్థ (ఎన్‌టీఏ) విశ్వసనీయతపైనా రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అటువంటి పరిస్థితిలో ఎన్టీఏ అంటే ఏమిటి?, అది ఎలా పని చేస్తుంది, దాని గురించి ఎందుకు వివాదం ఉందనే విషయాలను తెలుసుకుందాం.
న్‌క్రిప్టెడ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో అమ్మకానికి ఉంచారని సీబీఐ ప్రాథమిక విచారణలో తేలింది. దీనిపై ఓ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం టెలిగ్రాం రియాక్ట్ అయింది. పేపర్ లీక్‌తో ప్రమేయం ఉన్న ఛానెళ్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఓ జాతీయ మీడియాకు తెలిపింది.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మంగళవారం నీట్ 2024 ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది 13 లక్షల మందికి పైగా అభ్యర్థులు నీట్ యూజీ పరీక్షలో ఉత్తీర్ణులవ్వగా, వారిలో 67 మంది అభ్యర్థులు నంబర్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఎలా అగ్రస్థానంలో నిలిచారనే దానిపై వివాదం నెలకొంది.
ఆదివారం దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షకు ఏర్పాట్లు పూర్తిచేసింది. దేశవ్యాప్తంగా 13 భాషల్లో, 499 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. అయితే ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మాత్రం నీట్ పరీక్షలు వాయిదాపడ్డాయి. మణిపూర్‌లో పరీక్ష కేంద్రాలు కేటాయించిన అభ్యర్థులందరికీ రేపు నీట్ పరీక్ష ఉండదని కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది.
NEET: ఏడాదికి రెండుసార్లు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)ని నిర్వహించేలా జాతీయవైద్య కమిషన్(ఎన్ఎంసీ), నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో దీనిపై క్లారిటీ ఇచ్చారు కేంద్ర ఆరోగ్య సహాయమంత్రి భారతి ప్రవన్ పవార్ క్లారిటీ ఇచ్చారు. అలాంటి ప్రతిపాదన ఏం లేదని ఆమె లోక్ సభకు తెలియజేశారు. నీట్ ను ఏడాదికి రెండుసార్లు నిర్వహించే ఆలోచన లేదని కేంద్రం ఆరోగ్య మంత్రిత్వశాఖ శుక్రవారం లోక్ సభకు తెలిపింది.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) జేఈఈ మెయిన్ పరీక్ష 2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2023 కోసం రిజిస్ట్రేషన్ డిసెంబర్ 15, 2022న ప్రారంభమవుతుంది. జనవరి 12, 2023న ముగుస్తుంది.