UGC-NET 2024: నీట్ 2024 పేపర్ లీక్ వ్యవహారంతో పాటు యూజీసీ నెట్ పరీక్ష రద్దు కావడం లాంటి పరిణామాలు దేశంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆ పరీక్ష మంగళవారం జరగ్గా.. దానికి రెండు రోజుల ముందే పరీక్షా పత్రం లీక్ అయింది.. ఆ వెంటనే ఎన్‌క్రిప్టెడ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో అమ్మకానికి ఉంచారని సీబీఐ ప్రాథమిక విచారణలో తేలింది. దీనిపై ఓ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం టెలిగ్రాం రియాక్ట్ అయింది. పేపర్ లీక్‌తో ప్రమేయం ఉన్న ఛానెళ్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఓ జాతీయ మీడియాకు తెలిపింది.
Read Also: Sharad Pawar: లోక్‌సభ ఎన్నికల్లో తక్కువ స్థానాల్లో పోటీ చేశాం.. కానీ ఇప్పుడు కుదరదు..!
ఇక, పరీక్ష పత్రాలకు సంబంధించి అనధికారిక సమాచారాన్ని వ్యాప్తి చేసిన ఛానెళ్లను బ్లాక్ చేసినట్లు టెలిగ్రాం తెలిపింది. దేశ చట్టాలకు లోబడి, దర్యాప్తునకు సహకరిస్తున్నామని పేర్కొనింది. పేపర్ లీకేజీ వ్యవహారంలో ఈ సోషల్ మీడియా సంస్థపైనా చాలా విమర్శలు రావడంతో తాజాగా స్పందించింది. దాంట్లో లీక్ అయిన పేపర్ అసలు పత్రంతో సరిపోలిందని ఇప్పటికే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సైతం వెల్లడించారు.
Read Also: MP Aravind Kumar: తెలంగాణలో నీట్ హీట్.. అరవింద్ కుమార్ ఇళ్లు ముట్టడి..
కాగా, యూజీసీ నెట్2024 అక్రమాలపై సీబీఐ విచారణ కొనసాగుతుంది. త్వరలో నెట్ పరీక్ష కొత్త డేట్ ప్రకటిస్తామని వెల్లడించింది. యూజీసీ నెట్ పరీక్షకు దాదాపు 11 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌నకు అర్హత సాధించడానికి, పీహెచ్‌డీల్లో ప్రవేశాలకు, యూనివర్సిటీలు, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలకు అర్హత సాధించడానికి ఈ ఎక్జామ్ ను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది.