నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్స్ 2025 పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్‌ను jeemain.nta.nic.in లేదా nta.ac.inలో చూడవచ్చు. షెడ్యూల్ ప్రకారం.. ఈ రోజు అక్టోబర్ 28 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు జేఈఈ మెయిన్స్ 2025 మొదటి సెషన్ కోసం నమోదు చేసుకోవచ్చు. నవంబర్ 22 రాత్రి 11:50 గంటల వరకు రిజిస్ట్రేషన్ లింక్ యాక్టివ్‌గా ఉంటుంది.
READ MORE: Dulquer Salmaan: తెలుగులో ఈ హీరోలతో దుల్కర్ సల్మాన్ మల్టీస్టారర్?
జేఈఈ మెయిన్స్ పరీక్షల నమోదు ప్రక్రియ అక్టోబర్ 28 నుంచి నవంబర్ 22 వరకు కొనసాగుతుంది. పరీక్ష 2025 జనవరి 22- 31 మధ్య నిర్వహించబడుతుంది.ఇందుకోసం పరీక్షకు మూడు రోజుల ముందు అభ్యర్థులకు అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచుతారు. పరీక్ష జరిగే నగరం గురించిన సమాచారం అభ్యర్థులకు ఒక వారం ముందుగానే ఇవ్వబడుతుంది. కాగా.. రెండో సెషన్ ఏప్రిల్‌లో ప్రారంభమవుతుంది.
READ MORE:Ukraine-Russia: ఉక్రెయిన్‌పై యుద్ధానికి ఉత్తర కొరియా సైన్యం.. ధృవీకరించిన నాటో
పూర్తి సమాచారం..
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ – 22 నవంబర్ 2024 రాత్రి 09 గంటల వరకు
ఫీజు డిపాజిట్ చేయడానికి చివరి తేదీ – నవంబర్ 22 నుంచి రాత్రి 11:50 వరకు.
పరీక్ష నగర సమాచారం – జనవరి 2025 మొదటి వారంలో విడుదల చేయబడుతుంది.
అడ్మిట్ కార్డ్- పరీక్ష తేదీకి మూడు రోజుల ముందు జారీ చేయబడుతుంది.
పరీక్ష షెడ్యూల్- 22 జనవరి నుంచి 31 జనవరి 2025 వరకు.
పరీక్ష ఫలితం- 12 ఫిబ్రవరి 2025
వెబ్‌సైట్- nta.ac.in, jeemain.nta.nic.in.