Viral News: ఎక్కడైన రోడ్లు వేయాలంటే సిమెంట్, డాంబర్, ఇసుక, రాళ్లు ఇలా దానికి సంబంధించిన కొన్ని సామాగ్రిని వాడుతారు. కానీ ఇక్కడ వెరైటీ రోడ్డు వేశారు.. కాని దాని కింద కార్పెట్ పెట్టి రోడ్డు వేశారు. అది ఎక్కడా అనుకుంటున్నారా..? మహారాష్ట్రలోని జల్నా జిల్లాలోని కర్జాత్-హస్త్‌పోఖారీలో ఈ రోడ్డును వేశారు. అయితే అలా రోడ్డు వేయడంపై అక్కడి గ్రామస్థులు ఆగ్రహానికి గురయ్యారు. అంతేకాకుండా వేసిన రోడ్డును ఎత్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Read Also: Smart TV: ఖర్చు లేకుండా 20 సెకన్లలోపు సాధారణ టీవీని స్మార్ట్ టీవీగా మార్చడం ఎలా?
ఇటీవల ప్రధానమంత్రి గ్రామీణ రహదారి పథకం కింద కొత్తగా రహదారి వేశారు. అయితే ఆ రహదారిని అక్కడి గ్రామస్తులు ఎత్తివేసారు. రోడ్డును ఎత్తేయడం ఏంటీ అనుకుంటున్నారా..? అవును నిజమేనండి.. ఆ రోడ్డు నిర్మాణంలో నాణ్యతలేక పోవడంతో.. రోడ్డును ఎత్తేశారు. అక్కడి జనాలు జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్ అధికారులకు తెలిపినా స్పందించలేదని వాపోతున్నారు. అయితే రోడ్డు ఎత్తివేసే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేంద్ర మంత్రి రావుసాహెబ్ దాన్వే సొంత జిల్లా అయిన జల్నాలో బురద నేలపై “కార్పెట్”పెట్టి రోడ్డు వేశారు. దానిని అందరికి తెలిసేందుకు అక్కడి గ్రామస్థులు చేతితో లేపి దానిని మడతపెట్టారు.
Read Also: Smriti Irani: రాహుల్ గాంధీ “ప్రేమ” వ్యాఖ్యలపై స్మృతి ఇరానీ ఆగ్రహం..
నాసిరకం పనులు ఎక్కువ కాలం ఆగవని.. గ్రామస్తులను మోసం చేసేందుకు ప్రయత్నించిన కాంట్రాక్టర్, రోడ్డు ఇంజినీర్లు, సంబంధిత శాఖపై చర్యలు తీసుకోవాలని అక్కడి జనాలు డిమాండ్ చేశారు. ఏదో అడపా దడపా.. రోడ్డు వేసి డబ్బులు దోచుకుందామన్న కాంట్రాక్టర్ కు ఇప్పుడు కటకటాల పాలవ్వడం తప్పేలా లేదనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా హల్ చల్ చేస్తుంది.
Villagers expose a poor quality road constructed between Karjt to Aste Bokhari village in Jalna District. According to reports, the road was built under Pradhan Mantri Gram Sadak Yojna (PMGSY).The video of villagers exposing the poor quality road has gone viral on social media… pic.twitter.com/r5PtPtWJX1
— Pune Mirror (@ThePuneMirror) May 31, 2023