ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో సమాజ్‌వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్యపై ఓ యువకుడు షూ విసిరాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఎస్పీ కార్యకర్తలు నిందితుడిని పట్టుకుని తీవ్రంగా కొట్టారు. అంతేకాకుండా పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దుశ్చర్యకు పాల్పడుతుండగా అడ్డుకులోదని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని.. విచారిస్తున్నారు.
Read Also: Fire Accident: పశ్చిమ ఢిల్లీలోని ఓ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు
మరోవైపు నిందితుడిని ఆకాష్ సైనీగా గుర్తించారు. యువకుడు లాయర్ వేషంలో వచ్చినట్లు సమాచారం. అయితే ఈ దాడిలో షూ స్వామి ప్రసాద్ మౌర్య వద్దకు చేరకపోవడంతో తృటిలో బయటపడ్డాడు. స్వామి ప్రసాద్ ఇటీవలి చేసిన వ్యాఖ్యలపై నిందితుడు తీవ్ర అసహనానికి గురయ్యాడని.. ఈ నేపథ్యంలో దాడి చేసినట్లు సమాచారం. యువకుడి దుశ్చర్యతో కార్యక్రమంలో గందరగోళ వాతావరణం నెలకొంది.
Read Also: BRS 1ST LIST: బీఆర్ఎస్ తొలి జాబితాను విడుదల చేసిన కేసీఆర్
ఇటీవల స్వామి ప్రసాద్ మౌర్య రామచరితమానస్ పశువులకు సంబంధించి అభ్యంతరకర ప్రకటన చేశారు. రామచరిత్మానస్‌లోని అభ్యంతరకరమైన శ్లోకాలను తొలగించాలని, కులాన్ని సూచించే పదాలు ఉపయోగించారని ఇటీవల స్వామి ప్రసాద్ మౌర్య రామచరితమానస్ పశువులకు సంబంధించి అభ్యంతరకర ప్రకటన చేశారు. రామచరిత్మానస్‌లోని అభ్యంతరకరమైన శ్లోకాలను తొలగించాలని, ఎందుకంటే కులాన్ని సూచించే పదాలు ఉపయోగించారని ఎస్పీ నాయకుడు అన్నారు.
Read Also: Pawan Kalyan : ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్..
సమాజ్‌వాదీ పార్టీ లక్నోలో వెనుకబడిన తరగతుల మహాసమ్మేళన్‌ను నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించేందుకు పార్టీ ప్రధాన కార్యదర్శి స్వామి ప్రసాద్ మౌర్య వచ్చారు. అయితే ఈ దాడికి సంబంధించి ఇప్పటి వరకు స్వామి ప్రసాద్ మౌర్య ఎలాంటి ప్రకటన చేయలేదు.