నేటి నుంచి సికింద్రబాద్ పరేడ్ గ్రౌండ్ లో కైట్ ఫెస్టివల్.. రాష్ట్ర టూరిజం శాఖ ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్.. ఈ నెల 15 వరకు జరగనున్న కైట్ ఫెస్టివల్.
నేడు హైదరాబాద్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటన.. మాసబ్ ట్యాంక్, దోబిఘాట్, చాచ నెహ్రు పార్క్, పోచమ్మ బస్తిల్లో పర్యటన.. మెహదీపట్నం, అంబేద్కర్ నగర్ కామ్యూనిటీ హల్ లో జరిగే వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొంటారు
నేడు ధాన్యం సేకరణకు రూ.2000 కోట్లు విడుదల.. లక్షా 77 వేల మంది రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి..
నేడు గుంటూరు, కుంచనపల్లి, తాడిగడపలోని సీఐడీ ఆఫీసుకు చంద్రబాబు.. ఇసుక, ఐఆర్ఆర్, మద్యం కేసుల్లో సీఐడీ అధికారులకు.. పూచీకత్తు, షూరిటీలు ఇవ్వనున్న చంద్రబాబు.
నేటితో హిందూపురం నియోజకవర్గంలో ముగియనున్న ఇంఛార్జ్ మంత్రి పెద్ధిరెడ్ఢి రామచంద్రారెడ్డి పర్యటన.. మూడు పండలాల్లో పంచాయితీల వారీగా సమీక్షాలు నిర్వహించిన మంత్రి.. సమావేశాలలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని పిలుపు.
నేడు అరకు పార్లమెంట్ సమీక్ష సమావేశం నిర్వహించనున్న రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి..
అరకు అసెంబ్లీ టిక్కెట్ కేటాయింపులో అసంతృప్తి నేతలతో సమావేశం..
నేడు శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండల పరిధిలోని పలు గ్రామాలలో పర్యటించనున్న మంత్రి ఉషశ్రీ చరణ్
నేడు బేతంచెర్ల మండలం బుగ్గానిపల్లెలో అర్బన్ హెల్త్ సెంటర్ ను ప్రారంభించనున్న మంత్రి బుగ్గన..
నేడు నెల్లూరు జిల్లాలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి..
నేడు నెల్లూరులో జనసేన పార్టీ అధ్వర్యంలో ముగ్గుల పోటీలు
నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఉత్తరాంధ్ర పర్యటన.. పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు వెళ్ళనున్న కేంద్ర మంత్రి.. విశాఖలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో కేంద్ర మంత్రి పాల్గోనే అవకాశం..
నేటి నుంచి భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారి తిరునాళ్ళు.. వచ్చేనెల 9వ తేదీ వరకు జరగనున్న మహోత్సవాలు..
నేటి నుంచి మూడు రోజుల పాటు ఆత్రేయపురంలో సంక్రాంతి పడవ పోటీలు.. పోటీలకు సిద్ధమవుతున్న నావ కార్మికులు
నేటి నుంచి ఏపీ హైకోర్టుకు సంక్రాంతి సెలవులు.. ఈ నెల 22 నుంచి హైకోర్టులో తిరిగి విచారణలు