మేనల్లుడి నిశ్చితార్థానికి హాజరైన సీఎం జగన్ దంపతులు
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్ లో తన సోదరి షర్మిల కుమారుడి వివాహ నిశ్చితార్థ వేడుకకు సతీసమేతంగా హాజరయ్యారు. వైఎస్ రాజారెడ్డి, ప్రియ అట్లూరి నిశ్చితార్థ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు. తర్వాత తన చెల్లెల్లు వైఎస్ షర్మిల, బావ బ్రదర్ అనిల్ లను పలకరించారు. అనంతరం హైదరాబాద్ నుంచి బయల్దేరనున్న సీఎం దంపతులు.. రాత్రికి తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకు చేరుకోనున్నారు. ఇక, గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌లో వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి నిశ్చితార్థం అట్లూరి ప్రియతో జరిగింది. షర్మిల కుమారుడు రాజారెడ్డి ఇటీవలే అమెరికాలోని టెక్సాస్ స్టేట్ డాల్లస్ లో అప్లైడ్ ఎకనామిక్స్ & ప్రిడిక్టివ్ అనలటిక్స్‌లో ఎంఎస్ పూర్తి చేసి యూనివర్సిటీ నుంచి పట్టా అందుకున్నాడు. ఇక, అమెరికాలోనే చదువుతున్న ప్రియ అట్లూరితో గత నాలుగేళ్లుగా పరిచయం ఉండగా.. ఇవ్వాళ ఈ జంట నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక, ఫిబ్రవరి 17వ తేదీన వీరిద్దరి వివాహం జరిపించనున్నట్టు షర్మిల తన ట్విట్టర్ అకౌంట్ లో వెల్లడించింది.
కొడాలి నానిది నోరా..? డ్రైనేజా..? నేనేంటో చూపిస్తా
గుడివాడలో రా..! కదలి రా..! కార్యక్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. మాజీ మంత్రి కొడాలి నానిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ కొడాలి నానిది నోరా..? డ్రైనేజా..?.. నా దగ్గరే ఓనమాలు నేర్చుకుని.. నన్నే విమర్శిస్తారా..? నేనేంటో చూపిస్తానంటూ ఆయన పేర్కొన్నారు. కొడాలి నాని వేధింపులతో ఆయన అనుచరుడే ఆత్మహత్య చేసుకున్నాడు.. గుడ్లవల్లేరులో మట్టికి రెక్కలొచ్చాయి.. గుడివాడకు ప్రధాన సమస్య ఇక్కడి ఎమ్మెల్యే కొడాలి.. కొడాలి నాని..! పిచ్చ పిచ్చ ఆటలొద్దు.. నోరు పారేసుకోవద్దు అని ఆయన చెప్పారు. వెనిగండ్ల రామును అభ్యర్థిగా పెడదామంటే.. రావి వెంకటేశ్వరరావు ఒప్పుకున్నారు.. రాము-రావి ఇద్దరూ కలిసి కొడాలి నానిని ఓడిస్తారు.. కొడాలి నానిని చరిత్రహీనులుగా కాలగర్భంలో కలిపేసేలా ఓడించాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
నా వెంట్రుక ముక్క కూడా చంద్రబాబు పీకలేరు..
గుడివాడలో టీడీపీ అధ్వర్యంలో రా కదిలి రా కార్యక్రమంలో ఎమ్మెల్యే కొడాలి నానిపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, చంద్రబాబు కామెంట్స్ కు కొడాలి నాని కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. గుడివాడలో టీడీపీ వర్దంతి సభ నిర్వహించారు.. సొల్లు నాయుడు ఏదేదో మాట్లాడారు.. 14 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు గుడివాడ అభివృద్ధి కోసం ఏం చేశారు అని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్, జగన్ హయాంలో పేదల ఇళ్ల నిర్మాణం కోసం 375 ఎకరాలు కొనుగోలు చేశారు.. టీడీపీ హయాంలో ఒక్క ఎకరం కూడా పేదల కోసం కొనుగోలు చేయలేదు.. మంచి నీటి అవసరాల కోసం 216 ఎకరాల్లో చెరువుల కోసం ఏర్పాటు చేశామని కొడాలి నాని తెలిపారు. నా వెంట్రుక ముక్క కూడా చంద్రబాబు పీకలేరు అని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. చంద్రబాబు ఉడత ఊపులకు భయపడను.. చంద్రబాబు ఎంతటి మోసగాడో అందరికీ చెబుతూనే ఉంటాను.. గెలుపు కోసం పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకుంటున్నారు.. బూట్లు నాకుతున్నారు.. శత్రువుకు కూడా లోకేష్ లాంటి కొడుకు పుట్టకూడదు.. చంద్రబాబుకు ఏం కోటాలో పదవి వచ్చింది.. నీతుల కోటాలోనా..? కోతల కోటాలోనా..? వెన్నుపోటు కోటానా..? అని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో టాటా గ్రూప్ రూ.1500 కోట్ల పెట్టుబడులు
రాష్ట్రంలోని 50 ఐటీఐలలో అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాల (స్కిల్లింగ్ సెంటర్లు) ఏర్పాటుకు టాటా గ్రూప్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. వీటిలో కొత్త కోర్సులు, మాస్టర్ ట్రైనర్ల నియామకానికి రూ.1500 కోట్ల పెట్టబడులు పెట్టనుంది. దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఇప్పటికే వివిధ రంగాల్లో విస్తరించిన టాటా గ్రూప్ తెలంగాణలో చేపట్టబోయే భవిష్యత్తు వ్యాపార ప్రణాళికలపై చర్చించారు. ఐటీ రంగంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) హైదరాబాద్ లోని అతి పెద్ద ఐటీ కంపెనీలలో ఒకటి . ఇందులో 80 వేల మందికి పైగా ఉద్యోగులున్నారు. రాబోయే కొన్నేళ్లలో టీసీఎస్ మరింత వృద్ధి చెందనుంది. టాటా అడ్వాన్స్ డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ఇప్పటికే గ్లోబల్ డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలో పలు ప్రాజెక్టులు చేపట్టింది. బోయింగ్, సికోర్స్ కీ, జిఇ, లాక్‌హీడ్ మార్టిన్ వంటి కంపెనీలతో కలిసి పెట్టుబడులు పెట్టింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్ గ్రేడ్ చేసేందుకు టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ (TTL) ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ కొత్త ప్రాజెక్టు చేపడుతోంది. లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ కోర్సులతో పాటు నైపుణ్యాల మధ్య అంతరాన్నితగ్గించే బ్రిడ్జి కోర్సులు నిర్వహిస్తుంది. కొత్త కోర్సులకు పెట్టుబడులు పెడుతుంది. టాటా గ్రూప్ కు చెందిన ఎయిర్ ఇండియా విస్తరణలోనూ హైదరాబాద్ ను ట్రాన్సిట్ హబ్ గా ఎంచుకోనుంది. హైదరాబాద్ నుంచి డొమెస్టిక్, ఇంటర్నేషనల్ విమానాల కనెక్టివిటీని పెంచనుంది.
లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశంలో రామరాజ్యం
లోక్ సభ ఎన్నికల తర్వాత దేశంలో రామరాజ్యమన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ.. హిందువులు ఐక్యం కావాలన్నారు. ఈ నెల 22న అందరూ ఇళ్ల ముందు దీపాలు వెలిగించాలని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దేవాలయాలకు రక్షణ అని ఆయన అన్నారు. పసుపు బోర్డు ప్రక్రియ మొదలయ్యిందని, ఈ సీజన్ లో పసుపు ధర 10 వేలకు తగ్గదన్నారు. 20 వేలు ధర వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. రాబోయే రోజుల్లో పసుపు రైతులకు బంగారు భవిష్యత్తు అని వ్యాఖ్యానించారు. రైతులు రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆయన తెలిపారు. అయోధ్య వివాదానికి కాంగ్రెస్ కారణమని ఎంపీ అరవింద్ పేర్కొన్నారు. రాహుల్… సోనియా లు జైశ్రీరాం అంటే వద్దంటామా అని ఆయన ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ పార్టీ ఇక క్లోజ్ అయినట్లేనని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ కవిత విషయంలో ఈడీ తన పని తాను చేసుకుపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. మహిళ అనే దృక్పధంతో ఈడీ చూస్తున్నట్లుందని, కవిత విచారణకు ఎందుకు హాజరు కావడం లేదు? అని ఆయన ప్రశ్నించారు. ఎవరు జైల్ కు వెళతారో త్వరలో తెలుస్తుందని, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కు 5వ సారి ఈరోజు నోటీసులు ఇచ్చారన్నారు. కవిత కు కూడా మళ్లి నోటీసులు రావచ్చు అన్నారు ఎంపీ అరవింద్.
కుప్పకూలిన గ్రీన్ ఫీల్డ్ హైవే బ్రిడ్జి.. తప్పిన పెను ప్రమాదం
ఖమ్మం నుంచి అశ్వరావుపేట మీదుగా నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవేకి సంబంధించిన బ్రిడ్జి నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలి పోయింది. దీంతో ఆ బ్రిడ్జి నిర్మాణంలో ఉన్న ముగ్గురు కూలీలు బ్రిడ్జి మించి ఒక్కసారిగా దూకి తమ ప్రాణాలను దక్కించుకున్నారు. ఖమ్మం నుంచి ప్రత్యేకంగా గ్రీన్ ఫీల్డ్ హైవే పేరుతో హైవే నిర్మాణం కొనసాగుతుంది. సూర్యాపేట మీదుగా ఖమ్మం వరకు నేషనల్ హైవే నిర్మాణం పూర్తయింది. కాగా ఖమ్మం నుంచి వైరా సత్తుపల్లి అశ్వరావుపేట, వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం కొనసాగుతుంది. అయితే వైరా వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. వైరా నుంచి మధిరకు వెళ్లే ప్రధానమైన రహదారిలో వైరా నుంచి తల్లాడ కి వెళ్లే రూట్లో ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కొనసాగుతుంది. ఈ బ్రిడ్జి నిర్మాణం కొనసాగుతుండగానే ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలు కాగా.. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బ్రిడ్జి ఎందుకు కూలిపోయిందనే విషయంపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
రామ మందిరంపై పోస్టల్ స్టాంపులు విడుదల చేసిన ప్రధాని
రామ మందిరంపై స్మారక తపాలా స్టాంపును ప్రధాని నరేంద్ర మోదీ గురువారం విడుదల చేశారు. దాంతో పాటు.. ప్రపంచవ్యాప్తంగా శ్రీరాముడిపై విడుదల చేసిన స్టాంపుల పుస్తకాన్ని కూడా ప్రారంభించారు. తపాలా స్టాంపు రూపకల్పనలో రామాలయం, చౌపాయి ‘మంగల్ భవన్ అమంగల్ హరి’, సూర్య, సరయూ నది, ఆలయం చుట్టూ ఉన్న విగ్రహాలు ఉన్నాయి. ఇవి.. భారతదేశం, అమెరికాతో సహా మొత్తం 21 దేశాలలో విడుదలయ్యాయి. కాగా.. ప్రధాని మోదీ విడుదల చేసిన స్టాంపుల పుస్తకంలో 6 స్టాంపులు ఉన్నాయి. వాటిల్లో రామాలయం, గణేశుడు, హనుమంతుడు, జటాయువు, కేవత్రాజ్, మా శబరిపై పోస్టల్ స్టాంపులు ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పోస్టల్ స్టాంపు పనితీరు గురించి మనందరికీ తెలుసు కానీ, పోస్టల్ స్టాంపులు మరో ముఖ్యపాత్ర పోషిస్తాయని అన్నారు. చరిత్ర, చారిత్రక సందర్భాలను తర్వాతి తరానికి తెలియజేసేందుకు పోస్టల్ స్టాంపులు ఒక మాధ్యమం అని తెలిపారు. ఇది కేవలం కాగితం ముక్క కాదని.. ఇది చరిత్ర పుస్తకమన్నారు. దీనిలో రూపాలు చారిత్రక క్షణాల చిహ్న రూపమని పేర్కొన్నారు. యువతరం వీటి నుండి చాలా తెలుసుకుంటుంది.. నేర్చుకుంటుందని మోదీ పేర్కొన్నారు. దేశ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులందరికీ తాను అభినందనలు తెలియజేస్తున్నానని ప్రధాని అన్నారు.
14కు చేరిన మృతుల సంఖ్య.. ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి
గుజరాత్‌లోని వడోదర హర్ని సరస్సులో పడవ బోల్తా పడిన ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. అందులో 12 మంది చిన్నారులతో పాటు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. పడవలో మొత్తం 27 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారని, వారిలో ఎవరూ లైఫ్ జాకెట్లు ధరించకపోవడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అంటున్నారు. విహారయాత్ర కోసమని పాఠశాల విద్యార్థులు ఇక్కడికి వచ్చారు. ఈ ఘటనలో అగ్నిమాపక సిబ్బంది ఇప్పటి వరకు ఏడుగురు విద్యార్థులను రక్షించగా, తప్పిపోయిన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘తన అపాయింట్‌మెంట్‌లను రద్దు చేసుకున్నాడని, వడోదరకు బయలుదేరి వెళ్తున్నట్లు’ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. “ప్రస్తుతం సహాయ, రక్షణ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఎక్కువ మంది ప్రాణాలతో బయటపడాలని భావిస్తున్నట్లు ప్రార్థిస్తున్నాము” అని భూపేంద్ర పటేల్ చెప్పారు. మరోవైపు.. ఈ ఘటనపై ప్రధాని మోదీ కూడా తీవ్ర దిగ్భ్రాంతి చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షలు, క్షతగాత్రుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50,000 చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
సాంప్రదాయని.. సుప్పిని.. సుద్దపూస అని.. రింగ్ టోన్ వచ్చేసిందిరోయ్
ఈ మధ్యకాలంలో ఓటిటీలో వచ్చిన ఏదైనా మంచి సిరీస్ ఉంది అంటే అది #90’s మిడిల్ క్లాస్ బయోపిక్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. శివాజీ, వాసుకి, మౌళి, వాసంతిక, రోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ కు ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించగా.. నవీన్ మేడారం నిర్మించాడు. జనవరి 5 న ఈ సిరీస్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సిరీస్ మొత్తం ఎంతో అద్భుతంగా ఉంది. 90 ల్లో ఒక మిడిల్ క్లాస్ తండ్రి.. తన కుటుంబాన్ని, పిల్లలను ఎలా చూసుకున్నాడు అనేది కథగా చూపించారు. ముఖ్యంగా బాల నటుడు రోహన్ కు మంచి పేరు వచ్చింది. ఆదిత్య పాత్రలో అతడి నటన నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. చదువు విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయాల్లో చురుగ్గా ఉండడం, తండ్రిని కూడా ఏడిపించడం, తల్లిని ఫుడ్ వండమని బెదిరించడం.. ఆమె కోపంగా ఉంటే సైలెంట్ గా సైడ్ అయిపోవడం, అన్నతో ఎన్ని గొడవలు పడినా.. అతడు బాధల్లో ఉంటే ఓదార్చడం.. బంధువులు వస్తే డబ్బులు తీసుకోవడానికి ప్లాన్ చేయడం.. ఒకటని కాదు.. సిరీస్ మొత్తం ఆదిత్య లేకపోతే వేరేలా ఉండేది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆదిత్య ఓవర్ యాక్షన్ చేసినప్పుడల్లా.. వెనుక ఒక బ్యాక్ గ్రౌండ్ సాంగ్ వస్తూఉంటుంది. “సాంప్రదాయని.. సుప్పిని.. సుద్దపూస అని.. నా.. నానా” అంటూ సాగే ఈ చిన్న మ్యూజిక్ బిట్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సిరీస్ రిలీజ్ అయ్యినప్పటినుంచి ఈ మ్యూజిక్ ను రింగ్ టోన్ గా పెట్టుకోవడానికి చాలామంది ట్రై చేశారు. ఎట్టకేలకు ఈటీవీ విన్.. ఆ ఫెసిలిటీని కల్పించింది. ఈ మ్యూజిక్ ను రింగ్ టోన్ గా మార్చి.. సోషల్ మీడియాలో లింక్ ఇచ్చింది.
స్మార్ట్‌ఫోన్‌ను కొనేప్పుడు ఈ 3 విషయాలు చెక్ చేయండి.. లేకుంటే మీరే బాధ పడతారు!
మీరు స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే, మీరు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అది కొనుగోలు చేసే సమయంలో మీరు చేసే ఒక పొరపాటు మీకు భారీ నష్టాన్ని కలిగించడమే కాకుండా, తర్వాత పశ్చాత్తాపడేలా కూడా చేయవచ్చు. అటువంటి పరిస్థితిలో, మీరు ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఫోన్ కొనేప్పుడు మైండ్ లో పెట్టుకోవాల్సిన చాలా ముఖ్యమైన 3 విషయాల గురించి ఒక లుక్ వేయండి. ఏమోల్డ్ చాలా మంచి డిస్ప్లే అని పరిగణించబడుతుంది. ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లలో ఈ డిస్‌ప్లే అందుబాటులో ఉన్నప్పటికీ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు, స్మార్ట్‌ఫోన్‌లో AMOLED డిస్‌ప్లే ఉండాలని మీరు గుర్తుంచుకోవాలి. అది ఉంటే మీరు చాలా మంచి పిక్చర్ క్వాలిటీ పొందబోతున్నారు. అలాగే, డిస్‌ప్లే బాగుంటే ఫోన్‌తో మీ ఎక్స్ పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. స్మార్ట్‌ఫోన్ ప్రాసెసర్ బాగుంటే దానిని ఉపయోగించిన మీ ఎక్స్ పీరియన్స్ చాలా బాగుంటుంది. అందువల్ల, మీరు స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసినప్పుడల్లా, ప్రాసెసర్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఒక పొరపాటు మీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుకు విలువ లేకుండా చేస్తుంది. మీరు గేమింగ్ కోసం కొంటున్నట్టు అయితే మీరు ప్రాసెసర్‌పై మరింతగా శ్రద్ధ వహించాలి. ప్రాసెసర్ ఎంత మెరుగ్గా ఉంటే, మీ గేమింగ్ అనుభవం అంత మెరుగ్గా ఉంటుంది.