Tree Cut in Kerala: మనుషులకే కాదు మూగజీవులకు కూడా భావోద్వేగాలు ఉంటాయి. అందులోనూ పక్షులు తమ తోటి పక్షులకు ఏదైనా అపాయం జరిగితే విలవిలలాడిపోతాయి. ఈ విషయంలో మనుషులు చలించకపోయినా పక్షులు తక్షణమే స్పందిస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియోలో అందరినీ అయ్యో అని కళ్లు చమ్మగిల్లేలా చేస్తోంది. ఈ హృదయవిచారక ఘటన కేరళలో చోటు చేసుకుంది. కేరళలో రోడ్డు విస్తరణ కోసం వందేళ్ల నాటి పురాతన చెట్టును అధికారులు ఒక్కసారిగా నరికేశారు. దీంతో ఆ చెట్టుపై ఉన్న పక్షులు గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచాయి.
అధికారులు ముందు, వెనుక చూడకుండా భారీ చెట్టును నరికివేయడంతో ఆ చెట్టుపై గూడులు కట్టుకున్న పక్షులు విలవిలాడిపోయాయి. ప్రాణభయంతో కొన్ని పక్షులు ఒక్కసారిగా గాలిలోకి ఎగిరియాయి. కానీ అనేక పక్షులు చెట్టు మధ్యలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాయి. వాటి గుడ్లు నాశనమైపోయాయి. కేరళలోని మలప్పురంలో ఈ ఘటనలో ఆగస్టులో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కాస్వాన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. చెట్టును నరకడం, అది నేలకూలడం, ఆ చెట్టుపై నుంచి వందలాది పక్షులు గాలిలోకి ఎగురుతుండటం వీడియోలో కనిపించింది. చెట్టు నేలకూలిన తర్వాత.. దగ్గరికి వెళ్లి చూడగా.. అనేక పక్షులు విగతజీవులుగా పడి ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా నేషనల్ హైవే అధికారులు చెట్టును నరికిన ఘటనపై కేరళ ప్రభుత్వం ఎన్‌హెచ్ఏఐకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ ఘటనపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కూడా ఫిర్యాదు అందింది.
Everybody need a house. How cruel we can become. Unknown location. pic.twitter.com/vV1dpM1xij
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) September 2, 2022