Admissions in Psychology Courses: జీవితం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. సైకాలజీ కోర్సుల్లో 50 శాతం పెరిగిన అడ్మిషన్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Admissions in Psychology Courses: దేశవ్యాప్తంగా సైకాలజీ కోర్సుల్లో అడ్మిషన్లు 50 శాతం పెరిగాయి. ఆనర్స్, పీజీ లెవల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఈ సబ్జెక్ట్‌పై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. దీంతో సైకాలజీగా బాగా డిమాండ్ పెరిగింది. డిగ్రీలో ఏ గ్రూప్ చదివినవారైనా సైకాలజీని సెలెక్ట్ చేసుకునేందుకు అవకాశం ఉంది. ప్రతిభావంతులైన విద్యార్థులు గతంలో మెడిసిన్, ఇంజనీరింగ్ కోర్సుల వైపు వెళ్లేవారు. ఇప్పుడు ముఖ్యంగా (పీజీ ఇన్) సైకాలజీ కోర్సుపై ఫోకస్ పెడుతున్నారు.
యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో ఇంతకుముందు సైకాలజీ కోర్సుకి 30-40 వేల అప్లికేషన్లు మాత్రమే వచ్చేవి. 2020-21 నుంచి 50-60 వేల వరకు వస్తున్నాయి. దీంతో 99 శాతం కటాఫ్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నాయని రామానుజన్ కాలేజీలోని అప్లైడ్ సైకాలజీ హెచ్‌ఓడీ ధర్మేంద్రనాథ్ తివారీ తెలిపారు. స్టూడెంట్స్ నుంచి స్పందన బాగా వస్తుండటంతో ఢిల్లీ యూనివర్సిటీ సైకాలజీలో సీట్లు పెంచింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల జీవితాలు చాలా సంక్లిష్టంగా మారుతున్నాయని తివారీ పేర్కొన్నారు.
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
OU Phd Admissions: ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ ప్రవేశాలపై వివాదం?
దీంతో సైకాలజీ సబ్జెక్టులు చదవటం ద్వారా రిలీఫ్ పొందాలని జనం భావిస్తున్నారని చెప్పారు. ఇగ్నోలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు ఒక అడ్మిషన్ సైకిల్‌లో (జూన్, డిసెంబర్ కలిపి) దాదాపు 4-5 వేల మంది చేరేవారు. గతేడాది మాత్రం సుమారు 10 వేల మంది ప్రవేశం పొందారు. ఈ సంవత్సరం ఇప్పటికే 5 వేల అడ్మిషన్లు పూర్తయ్యాయి. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. టీచర్లు, డెంటిస్టులు, హోమియోపతివాళ్లు, లాయర్లు, జర్నలిస్టులు డిస్టెన్స్ లెర్నింగ్ పీజీ కోర్సుల్లో ఎన్‌రోల్ అవుతున్నారు.
బెంగాళూరులోని జైన్(డీమ్డ్ టు బి యూనివర్సిటీ)లో ఈ ఏడాది సైకాలజీ ప్రోగ్రామ్‌కి 50-60 శాతం అధికంగా అప్లికేషన్లు వచ్చాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్‌ఓ) 2017 రిపోర్ట్ ప్రకారం మన దేశంలోని ప్రతి ఏడుగురిలో ఒకరు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కానీ.. 1.3 బిలియన్ ప్రజలకు 9 వేల మంది మాత్రమే సైకియాట్రిస్ట్‌లు ఉన్నారు. 10 మిలియన్‌ల మందికి కేవలం ఏడుగురే కౌన్సిలర్లు ఉన్నారు.
దీన్నిబట్టి సైకాలజీ ప్రొఫెషనల్స్‌కి ఎంత గిరాకీ ఉందో అర్థంచేసుకోవచ్చు. ఆర్థిక అభివృద్ధి అనే నాణేనికి ఒకవైపు అంతా బాగున్నట్లే కనిపిస్తోంది. రెండో మాత్రం చాలా బాధాకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. అన్ని రంగాల్లోనూ పోటీ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో సామాజిక, శాస్త్రీయ, సాంకేతిక అసమానతలు రాజ్యమేలుతున్నాయి. దీంతో.. ఆదాయ వ్యయాల మధ్య తీవ్ర వ్యత్యాసాలు నెలకొన్నాయి.
ఉద్యోగ జీవితాలు కూడా స్థిరంగా కొనసాగట్లేదు. కొలువులు కోల్పోవటం, ఆర్థిక ఇబ్బందులు ప్రజల మానసిక ఆరోగ్యం, స్థితిగతులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. కరోనా సమయంలో అయినవారు అనూహ్యంగా దూరంగా కావటం, అనారోగ్యానికి గురికావటం వంటివి ఎన్నో సమస్యలకు కారణమవుతున్నాయి. దీంతో సైకాలజీ సబ్జెక్టు చదవాలనే ఆసక్తి అన్ని వర్గాల ప్రజల్లో పెరుగుతోంది అని జైన్ వీసీ రాజ్ సింగ్ వివరించారు.
తాజావార్తలు
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్‌లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
-
US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
INDIA Bloc: సీఈసీకి వ్యతిరేకంగా నేడు చెన్నైలో విపక్ష కూటమి నిరసన.. పాల్గొననున్న టీవీకే
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..