నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరుకానున్నారు. ఈ కేసులో అక్రమ నగదు చలామణికి పాల్పడిన అభియోగంపై ప్రశ్నించేందుకు ఆమెకు ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ పార్టీ మరోసారి దేశవ్యాప్తం ఆందోళనకు సిద్ధం అవుతోంది. బుధవారం జరిగిన సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో భాగంగా ఈ నెల 21న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) , కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని విచారించనున్నారు. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలకు పిలుపునిచ్చింది. బీజేపీ, కేంద్రప్రభుత్వ చర్యలను ప్రజల్లో ఎండగట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. గురువారం మరోసారి కాంగ్రెస్ ముఖ్య సమావేశం జరగనుంది. దీంట్లో ‘భారత్ జోడో యాత్ర’పై చర్చించనున్నారు.…
నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఆయనను అధికారులు 40 గంటలకు పైగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇవాళ ఐదోరోజు మరోసారి రాహుల్‌ను ప్రశ్నిస్తున్నారు. నేటితో ఆయన విచారణ ముగియనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సోనియా గాందీ కూడా ఈ కేసులో ఈ నెల 23న ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది. సోనియాగాంధీ ఇప్పటికే ఈడీ ముందు…
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సోమవారం నాలుగోరోజు కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరయ్యారు. దాదాపు 12 గంటలపాటు ఈడీ ఆయనను సుదీర్ఘంగా విచారించింది. జూన్ 13, 14, 15 తేదీల్లో రాహుల్‌ను 30 గంటలకు పైగా ఈడీ లోతుగా విచారించడం తెలిసిందే. గత వారంలో వరుసగా మూడు రోజులు ఈడీ ప్రశ్నల పరంపరను ఎదుర్కొన్న రాహుల్.. సోమవారమూ హాజరయ్యారు. ఉదయం 11 గంటల సమయంలో ఈడీ ప్రధాన కార్యాలయానికి రాహుల్…
నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ నిమిత్తం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు వరుసగా నాలుగోసారి ప్రశ్నిస్తున్నారు. రాహుల్ గాంధీని ఇప్పటి వరకు దాదాపు 30 గంటల పాటు ఈడీ విచారించింది. శుక్రవారమే విచారణకు రావాలని ఈడీ రాహుల్‌కు సమన్లు జారీ చేయగా.. మూడు రోజులు సమయం ఇవ్వాలని కోరారు. తన తల్లి సోనియా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఈ క్రమంలో 17న కాకుండా 20న విచారణకు…
నేషనల్ హెరాల్డ్ కేసులో నాలుగో విడత విచారణ నిమిత్తం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరుకానున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలు చేపట్టనుంది. పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి తీవ్రనిరసనల మధ్య రాహుల్ గాంధీని జూన్ 13 నుంచి 15వరకు మూడు రోజుల పాటు ఈడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే. మరో సారి ఈ నెల 17న విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు…
సోనియాగాంధీ ఆరోగ్యంపై కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పోస్ట్ కొవిడ్ సమస్యలతో పాటు ఆమె దిగువ శ్వాసనాళంలో ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారని కాంగ్రెస్ ప్రకటించింది. ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించింది. ఆమెకు వైద్యుల నిరంతర పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని స్పష్టం చేసింది. ఇటీవల కరోనా బారినపడ్డ ఆమె జూన్ 12న ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. మరోవైపు సోనియాగాంధీ త్వరగా కోలుకోవాలని…
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు కదంతొక్కాయి. తమ అగ్రనేతలనే లక్ష్యంగా చేసుకుంటారా అంటూ రగిలిపోతున్నాయి. ఢిల్లీ నుంచి గల్లీ వరకు, కాంగ్రెస్ ఆందోళనలతో దేశమంతా అట్టుడికిపోయింది. రాహుల్ గాంధీ సుదీర్ఘ ఈడీ విచారణ…కొన్ని రోజుల్లో సోనియా గాంధీకి సైతం తప్పని దర్యాప్తు సంస్థల ప్రశ్నలు…ఈ పరిణామాలు, కాంగ్రెస్ నాయకుల్లో ఒక్కసారిగా కదలిక తెచ్చాయా? నిస్తేజంగా వున్న క్యాడర్ లో కదన కుతూహలం పెంచాయా? జాతీయ రాజకీయాల్లో ఎన్నడూలేనంతగా కుదుపు. దేశవ్యాప్తంగా పొలిటికల్ ప్రకంపనల దుమారం. అన్ని రాష్ట్రాల కాంగ్రెస్…
కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కాంగ్రెస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగితే బాధ్యత మీదే అంటూ హెచ్చరించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తోంది. అయితే దీనికి నిరసనగా కర్ణాటక వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలు తెలియజేస్తోంది. పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరిగితే కాంగ్రెస్ పార్టీనే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కే. సుధాకర్…
కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీని నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారిస్తోంది. ఈ విచారణపై కాంగ్రెస్ పార్టీ ఫైర్ అవుతోంది. దేశ రాజధానితో పాటు అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలుపుతున్నాయి. బుధవారం ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో ఢిల్లీ పోలీసులు ఎంపీలపై అనుచితంగా వ్యవహించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఎంపీలని చూడకుండా లాఠీ ఛార్జ్ చేశారని కాంగ్రెస్ ఎంపీలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తమిళనాడుకు చెందిన ఎంపీ జోతిమణి, ఢిల్లీ…