Anjan kumar: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ కేసు చాలా రోజుల తర్వాత మళ్లీ తెరపైకి వచ్చింది. మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ మరో సారి ఈడీ నోటీసులు ఇచ్చింది. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులో తెలిపింది. నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు రావాలని ఆదేశించింది. దీంతో అంజన్ కుమార్ ఢిల్లీ బయలుదేరి వెళ్లినట్లు సమచారం. గతంలో ఈడీ విచారణకు అంజన్ కుమార్ హాజరైన విషయం…
National herald case - ED seals Young Indian's office: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీలోని బహదూర్ షా జాఫర్ మార్గ్ లోని నేషనల్ హెరాల్డ్ ఆఫీసులో ఉన్న యంగ్ ఇండియా కార్యాలయాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ) సీజ్ చేసింది. ఈ ఘటన గాంధీ కుటుంబానికి పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. హెరాల్డ్ హౌజ్ భవనానికి సంబంధించిన ఆర్డర్లను కూడా ఈడీ అతికింది.
నేషనల్ హెరాల్డ్ కేసు విచారణలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరింత దూకుడు పెంచింది. ఈ కేసులో భాగంగా ఈడీ దాడులు కొనసాగిస్తోంది. ఉదయం 8 గంటల నుంచే సోదాలు మొదలైనట్లు అధికారులు తెలిపారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో… ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును వేగవంతం చేసింది. మనీలాండరింగ్ కేసులో మంగళవారం నేషనల్ హెరాల్డ్ కార్యాలయంపై ఈడీ దాడులు నిర్వహించింది. హస్తినలోని కేంద్ర కార్యాలయంతో పాటు 12 ప్రాంతాల్లో సోదాలు చేసింది. దాడులు పూర్తయిన తర్వాత… ఆస్తులను అటాచ్ చేసేందుకు ఈడీ సిద్ధమవుతోంది. గల నెలలో మూడు రోజులు పాటు ఈడీ… సోనియా గాంధీని 12 గంటల పాటు ప్రశ్నించింది. అనారోగ్యంతో ఉన్నప్పటికీ… విచారణ పేరుతో ఈడీ కార్యాలయానికి రప్పించింది. అంతకు ముందు సోనియా…
National Herald Case: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని మూడో రోజు విచారించనుంది ఈడీ. ఇప్పటి వరకు రెండు రోజుల పాటు సోనియా గాంధీ విచారణ సాగింది. సుమారు 9 గంటల పాటు సోనియాగాంధీని ఈడీ అధికారులు విచారించారు. బుధవారం ఉదయం 11 గంటలకు మరోసారి ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు సోనియా. సోనియా గాంధీ విచారణ సందర్భంగా నిన్నంతా ప్రియాంకాగాంధీ తోడుగా ఉన్నారు.
దేశరాజధానిలో కాంగ్రెస్ చేపట్టిన నిరసనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్‌పై ఢిల్లీ పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నాయకుడిని జుట్టు పట్టుకుని కారు లోపలికి పోలీసులు నెట్టేశారు. స్థానికంగా గుమిగూడిన మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్న శ్రీనివాస్‌ను బలవంతంగా కారు లోపలికి తోసేశారు.