నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో రాహుల్ గాంధీని మూడు రోజులుగా ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ) విచారిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలుపుతున్నాయి. ఢిల్లీలో ఈడీ ఆఫీస్ ముందే కాంగ్రెస్ అగ్రనేతలు నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన, ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా రాహుల్ గాంధీ ఈడీ విచారణపై తెలంగాణ కాంగ్రెస్ రాజ్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. గురువారం…
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఆఫీసుకి విచారణ కోసం రాహుల్ గాంధీ ఈరోజు కూడా వచ్చారు. గత రెండురోజులుగా గంటల కొద్దీ విచారణ సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపుచర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో కార్యకర్తలను, నాయకులను అరెస్టు చేసి, బస్సులలో వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు పోలీసులు.’మేము ఉగ్రవాదులమా? మమ్మల్ని చూసి ఎందుకు భయపడుతున్నారు?’ అని కాంగ్రెస్ఎంపీ అధిర్ రంజన్ చౌదరి.. పోలీసులపై తీవ్రంగా మండిపడ్డారు.…
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని గత రెండు రోజుల పాటు విచారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. వరుసగా మూడో రోజూ విచారణకు రావాలని ఆదేశించింది. దీంతో ఇవాళ కూడా ఆయన ఈడీ ఎదుట హాజరయ్యారు. గత రెండు రోజుల్లో దాదాపు 21 గంటల పాటు రాహుల్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. రాహుల్ఈడీ విచారణ నేపథ్యంలో కాంగ్రెస్ ఆందోళనలు ఉద్ధృతంగా మారాయి. పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద రాహుల్ గాంధీ స్టేట్‌మెంట్‌ను ఈడీ అధికారులు రికార్డు…
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని బుధవారం కూడా విచారణకు హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆదేశించింది. మంగళవారం 11 గంటలకు పైగా ఆయనపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. నగదు అక్రమ చలామణి అభియోగాలకు సంబంధించి సమాధానాలు రాబట్టి, వాంగ్మూలం నమోదు చేసింది. మరోవైపు- రాహుల్ విచారణకు హాజరైన నేపథ్యంలో హస్తినలో మంగళవారమూ కాంగ్రెస్ పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తూ ఆందోళనలు చేపట్టినందుకుగాను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ…
నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. తెలంగాణలోనూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలోనూ కాంగ్రెస్ కార్యకర్తలు రెండో రోజు ఈడీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. మోడీకి భయం పుట్టినప్పుడల్లా గాంధీ కుటుంబం పై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ విచారణ…
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేతల విచారణ సాగుతోంది. సోమవారం రోజు విచారణలో భాగంగా కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యారు. అయితే మంగళవారం ( జూన్14)న కూడా విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. దీంతో రాహుల్ గాంధీని నేడు కూడా విచారించనుంది ఈడీ. సోమవారం విచారణకు హాజరైన రాహుల్ గాంధీని ఈడీ దాదాపుగా 10 గంటల పాటు విచారించింది. సోమవారం ఉదయం ప్రారంభం అయిన విచారణ రాత్రి…
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీకి నోటీసులు పంపించింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. అందులో భాగంగా ఇవాళ ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు రాహుల్ గాంధీ.. ముగ్గురు అధికారుల ఈడీ బృందం రాహుల్‌ను ప్రశ్నించింది.. నేషనల్ హెరాల్డ్‌తో సంబంధాలు, ఏజేఎల్‌లో ఉన్న స్థానం, యంగ్ ఇండియాలో పాత్రపై రాహుల్ గాంధీపై ప్రశ్నల వర్షం కురిపించినట్టుగా తెలుస్తుండగా.. ఆయన మాత్రం తనకు తెలియదని సమాధానం ఇచ్చినట్టుగా సమాచారం.. అయితే,…
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కాంగ్రెస్ అధినేత్రికి ఇటీవల సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరుకావాలని కోరింది. అయితే ఈ లోపే ఆమె కరోనా బారిన పడ్డారు. నిజానికి ఈనెల 8 సోనియా గాంధీ ఈడీ ముందు హాజరుకావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా ఆమెను జూన్ 23న విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ తాజా నోటిసులు జారీ చేశారు. ఈ కేసులో కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీని కూడా ఈడీ…
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కరోనా పాజిటివ్ గా తేలింది. ఆమె తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్నట్లు, స్వల్పంగా జ్వరం ఉన్నట్లు కాంగ్రెస్ అధకార ప్రతినిధి రణ్ దీప్ సుర్జేవాలా ప్రకటించారు. కరోనా నుంచి సోనియా గాంధీ త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రార్థిస్తున్నారు. కరోనా బారి నుంచి త్వరగా కోలుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మానిక్కం ఠాగూర్, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క కోరుకున్నారు. నిన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), నేషనల్ హెరాల్డ్…