నేడు కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ లతో కూడిన ధర్మాసనం ముందు వాదనలు జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. “అమైకస్ క్యూరీ” గా పరమేశ్వరన్ వ్యవహరించారు. విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ తెలంగాణ ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇష్టానుసారంగా డజన్ల కొద్ది బుల్డోజర్లు చెట్లను తొలగించేందుకు ఉపయోగించారని మండిపడ్డారు. ఇదంతా ముందస్తు పథకం…
కంచ గచ్చిబౌలి భూములపై డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుల సంయుక్త ప్రకటన చేశారు. కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు కోర్టు ఆదేశాలను పాటిస్తామని తెలిపారు. సర్వోన్నత న్యాయస్థానం కోరిన సమాచారాన్ని గడువులోపు పంపిస్తామని వెల్లడించారు. సుప్రీంకోర్టుపై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి విశ్వాసం ఉందని.. న్యాయం గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థులపై కఠినంగా వ్యవహరించవద్దని అదనపు డీజీ (ఇంటెలిజెన్స్), సైబరాబాద్ కమిషనర్లను మంత్రులు ఆదేశించారు. Also Read:Ambati Rambabu: లోకేష్..…
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని 400 ఎకరాలను తెలంగాణ ప్రభుత్వం వేలం వేయడాన్ని నిరసిస్తూ విద్యార్థిలోకం గర్జిస్తోంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తున్నాయి. పారిశ్రామిక అభివృద్ధి కోసం చెట్లను నరికేసి భూములను వేలం వేయడాన్ని పర్యావరణవేత్తలు ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో కంచ గచ్చిబౌలి HCU భూముల విషయంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. Hcu.. కంచ గచ్చిబౌలి స్థలాల్లో ఎలాంటి పనులు చేయొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. Also Read:Hyderabad: అమీన్ పూర్ పిల్లల…
Ponguleti Sudhakar Reddy : ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి కిష్టారం అంబేద్కర్ నగర్, బీసీ కాలనీలకు కాలుష్యాన్ని వెదజల్లుతున్న సైలో బంకర్‌పై పొంగులేటి సుధాకర్ రెడ్డి స్పందించారు. ఇవాళ ఆయన కిష్టారం గ్రామంలో పర్యటించి మాట్లాడుతూ.. కాలుష్యం భారీ నుండి కిష్టారం గ్రామాన్ని రక్షించండన్నారు. ఇప్పటికే చాలా మంది చనిపోయారని, చనిపోయిన వారి ఫోటోలు చూస్తా ఉంటే చాలా బాధగా ఉందన్నారు పొంగులేటి సుధాకర్ రెడ్డి. ఎన్నికల ప్రచారం ఉన్నప్పటికీ .. నా ప్రాంత ప్రజలు ఇబ్బందుల్లో…
పంజాబ్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ప్రభుత్వానికి గురువారం రూ.1026 కోట్ల జరిమానా విధించింది. పాత వ్యర్థాలు, మురుగునీటి విసర్జన నిర్వహణపై ఖచ్చితమైన చర్యలు తీసుకోనందుకు పంజాబ్ ప్రభుత్వంపై ఎన్జీటీ ఈ జరిమానా విధించింది.
అక్రమంగా నిర్మించిన స్టూడియోలపై ముంబై మున్సిపల్ అధికారులు కొరడా ఝుళిపించారు. ముంబైలోని మలాడ్ ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన డజన్ల కొద్దీ ఫిల్మ్ స్టూడియోలను కూల్చివేసేందుకు బుల్డోజర్లు ప్రవేశించాయి. వీటిని మహా వికాస్ అఘాడి ప్రభుత్వ రక్షణలో నిర్మించారని బిజెపి ఆరోపించింది.
విశాఖ పట్నంలోని రిషికొండలో టూరిజం భవనాల నిర్మాణాలపై ఎన్జీటీ విధించిన స్టే ఎత్తివేయాలని..ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. రిషికొండలో నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దేశ సర్వోన్నత న్యాయస్థానం. అక్కడ చదును చేసే ప్రాంతంలో నిర్మాణాలు చేసుకునేందుకు సుప్రీం కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఇప్పటికే నిర్మాణాలున్న ప్రాంతంలో యథావిథిగా నిర్మాణాలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. రుషికొండ ప్రాజెక్ట్ కేసు విచారణ హైకోర్టుకు బదిలీ చేసింది. ట్రిబ్యునల్ పరిధి కంటే…
రిషికొండ టూరిజం ప్రాజెక్టు వ్యవహారంలో ఎన్జీటీ తీరును దేశ అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ ఆధారంగా ప్రాజెక్టు పనులను నిలిపివేస్తూ ఎన్జీటీ స్టే ఇవ్వడాన్ని తప్పుబడుతూ ఏపీ ప్రభుత్వం పిల్ వేసింది. ఈ పిటిషన్‌పై మంగళవారం నాడు వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టులను చేరుకోలేని వారు రాసే లేఖలను మాత్రమే పిటిషన్లుగా పరిగణించాలంటూ హితవు పలికింది. Dhulipalla Narendra: ఏపీలో పశువుల దాణా తరహా కుంభకోణం కాగా ఏపీ ప్రభుత్వం…
అక్రమ కంకరమిషన్ల పై సరైన చర్యలు తీసుకోలేదని తెలంగాణ చీఫ్ సెక్రటరీ పై అసంతృప్తి వ్యక్తం చేసింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT). నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న కార్యకలాపాలపై కన్నెర్ర జేసింది. ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో, ఎంత జరిమానా విధించారో చెప్పలేదని ఎన్టీసీ అసహనం వ్యక్తం చేసింది. చీఫ్ సెక్రటరీ నివేదిక సమగ్రంగా లేదని చెన్నై ఎన్జీటీ అభిప్రాయపడింది. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని తెలంగాణ సీఎస్ ను ఆదేశించింది ఎన్జీటి. పిసటి…