Rishikonda: రిషికొండలో నిర్మాణాలకు సుప్రీంకోర్ట్ గ్రీన్ సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ పట్నంలోని రిషికొండలో టూరిజం భవనాల నిర్మాణాలపై ఎన్జీటీ విధించిన స్టే ఎత్తివేయాలని..ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. రిషికొండలో నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దేశ సర్వోన్నత న్యాయస్థానం. అక్కడ చదును చేసే ప్రాంతంలో నిర్మాణాలు చేసుకునేందుకు సుప్రీం కోర్టు అనుమతి మంజూరు చేసింది.
ఇప్పటికే నిర్మాణాలున్న ప్రాంతంలో యథావిథిగా నిర్మాణాలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. రుషికొండ ప్రాజెక్ట్ కేసు విచారణ హైకోర్టుకు బదిలీ చేసింది. ట్రిబ్యునల్ పరిధి కంటే హైకోర్టు పరిధి ఎక్కువని తేల్చింది సుప్రీం కోర్టు. హైకోర్టు ఆదేశించినప్పటికీ ఎన్జీటీ బేఖాతరు చేయడం తగదని హితవు పలికింది.
Also Read
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
హైకోర్టు రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి హైకోర్టు ఉత్తర్వులే అమలు చేయాల్సి ఉంటుందని స్పష్టీకరించింది. హైకోర్టు ఉత్తర్వులే అమలు చేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. అప్పటి వరకు ఎన్జీటీలో విచారణ జరపరాదని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఎన్జీటీలో జరిగే విచారణను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది.
ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ ఆధారంగా ప్రాజెక్టు పనులను నిలిపివేస్తూ ఎన్జీటీ స్టే ఇవ్వడాన్ని తప్పుబడుతూ ఏపీ ప్రభుత్వం పిల్ వేసింది. ఈ పిటిషన్‌పై మంగళవారం నాడు వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టులను చేరుకోలేని వారు రాసే లేఖలను మాత్రమే పిటిషన్లుగా పరిగణించాలంటూ హితవు పలికింది.ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్ సింఘ్వి వాదనలు వినిపించారు.
ఈ ప్రాజెక్టుతో 300 మందికి ఉపాధి దొరుకుతుందని, రూ.180 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రభుత్వం కోర్టుకు వివరించింది. ఓ ఎంపీ రాసిన లేఖ ఆధారంగా ఎన్జీటీ స్టే ఉత్తర్వులు జారీ చేసిందని తెలపగా.. సుప్రీంకోర్టు ఎన్జీటీ తీరు సరికాదని హితవు పలికింది. ఈ కేసులో తదుపరి విచారణను సుప్రీంకోర్టు బుధవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. బుధవారం ఈ కేసులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు రిషికొండ నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ మంజూరు చేసింది.
Supreme Court: రిషికొండ టూరిజం ప్రాజెక్టుపై విచారణ రేపటికి వాయిదా
తాజావార్తలు
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!