ఫార్మా కంపెనీల కాలుష్యంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సీరియస్ అయింది. దీనిపై ప్రభుత్వాన్ని నివేదిక కోరింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. తెలంగాణ కాలుష్య నియంత్ర మండలి, యాదాద్రి-భువనగిరి జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ కే. రామకృష్ణ, ఎక్స్‌పర్ట్ మెంబర్ కే. సత్యగోపాల్‌తో కూడిన చెన్నై-ఎన్జీటీ బెంచ్ ఈ ఆదేశాలు జారీచేసింది. తెలంగాణకు చెందిన గుమ్మి నరేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది ట్రిబ్యునల్. ఫిర్యాదు చేసినప్పటికీ ఫార్మా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రిబ్యూనల్ (ఎన్జీటీ) రూ.120 కోట్ల జరిమాన విధించింది. ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం గుర్తించిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారని ఎన్‌జీటీ ఈ జరిమానా విధించింది. మొత్తం రూ. 120 కోట్లను కట్టాలని ఎన్‌జీటీ పేర్కొంది. కాగా ఇ్పపటికే ఈ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం వేగవంతంగా పనులను చేపడుతుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే అటు ఉత్తరాంధ్రతోపాటు ఉభయ గోదావరి జిల్లాలలకు తాగునీటి కష్టాలు తీరుతాయి.…
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలోని లుంబిని పార్క్ వద్ద ఉండే పాత సచివాలయాన్ని కూలగొట్టి ప్రతిష్టాత్మకంగా నూతన సచివాలయాన్ని నిర్మిస్తోంది. అయితే సచివాలయం నిర్మాణం విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్తగా నిర్మించే సచివాలయం కోసం పర్యావరణ అనుమతులు తీసుకోకపోవడంపై మండిపడింది. ఈ విషయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఇప్పటివరకు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రశ్నించింది. Read Also: సింగరేణిలో…
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటైన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) బ్రేక్ వేసింది.. ప్రాజెక్టు పనులు నిలిపి వేయాలని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది… పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులు చేపట్టవద్దని స్పష్టం చేసింది.. కాగా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని కరివెన వద్ద నిర్మిస్తున్నారు. దీనికి 2015, జూన్ 11న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణానది…
రాయలసీమ ఎత్తిపోతల కేసులో మరోసారి విచారణ జరిపింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ).. ఇవాళ విచారణ సందర్భంగా.. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఎన్జీటీకి నివేదిక అందజేసింది.. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించిన కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన శాస్త్రవేత్త పసుపులేటి డా. సురేష్ బాబు.. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు స్థలం వద్ద ఎలాంటి పనులు జరగడం లేదని.. ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకువచ్చిన సామగ్రి అంతా ఆ ప్రాంతంలో నిల్వ ఉంచారని ఎన్జీటీ…
నేషన్ గ్రీన్ ట్రిబ్యునల్, చెన్నైకి లేఖ రాసింది కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)… రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పరిశీలన నివేదిక సమర్పించేందుకు మరో మూడు వారాలు గడువును ఇవ్వాల్సిందిగా.. ఎన్జీటీని కోరారు బోర్డ్ మెంబెర్ సెక్రటరీ రాయపురే.. కాగా, గత వారం రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు పరిశీలించి నివేదిక సమర్పించాలని కోరినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరాలతో ఇప్పటికే రెండు, మూడు సార్లు పర్యటన వాయిదా వేశారు. అయితే, ఎన్జీటీ పెట్టిన గడువు త్వరలోనే…
రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు వ్యవహారం ఏపీ, తెలంగాణ మధ్య కాకరేపాయి.. పరస్పరం ఆరోపణలు, విమర్శలు, ఫిర్యాదులు.. ఇలా చాలా వరకే వెళ్లింది వ్యవహారం.. అయితే, విషయంలో కృష్ణా నది యాజమాన్యబోర్డుకు కీలక ఆదేశాలు జారీ చేసింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ), చెన్నై బెంచ్.. సొంతంగా తనిఖీలు జరిపి నివేదిక ఇవ్వాలని కృష్ణా బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది.. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు తనిఖీలకు ఏపీ ప్రభుత్వం సహకరించడం లేదన్న కృష్ణా బోర్డు నివేదనను పరిగణలోకి…