Black Hole: సైన్స్ అభివృద్ధి చెందే కొద్ది విశ్వంలోని కోటానుకోట్ల వింతల్లో కొన్ని వెలుగులోకి వస్తున్నాయి. మన భూమి, సూర్యుడు, సౌర కుటుంబంతో పాటు కొన్ని బిలియన్ల నక్షత్రాలకు కేంద్రంగా ఉన్న మిల్కీ వే(పాలపుంత) గెలాక్సీ ఉంది. కొన్నాళ్ల వరకు పాలపుంత గెలాక్సీ మధ్యలో సూపర్ మాసివ్ ‘బ్లాక్ హోల్’ ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే, సైన్స్ పురోగతి సాధించడంతో నిజంగా మిల్కీవే కేంద్రంలో బ్లాక్ హోల్ ఉన్నట్లు గుర్తించారు. సజిటేరియస్ A బ్లాక్ హోట్…
2024లో అనేక గ్రహణాలు కనిపించనున్నాయి. ఈ సంవత్సరం చంద్రగ్రహణంతో పాటు సూర్యగ్రహణం వంటి ఖగోళ సంఘటనలకు సాక్షిగా ఉంటుంది. చంద్రుడు భూమికి మధ్య వచ్చి సూర్యుని కాంతిని అడ్డుకున్నప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఏప్రిల్‌లో అమెరికాలో సూర్యగ్రహణం ఏర్పడనుంది. కానీ సూర్యగ్రహణం సంభవించే ప్రదేశం భూమి మాత్రమే కాదు. ఈ రకమైన గ్రహణం సౌర వ్యవస్థలోని ఇతర గ్రహాలపై కూడా సంభవిస్తుంది.
Asteroid: సౌరకుటుంబంలో కొన్ని ఏళ్లకు ఒకసారి భూమికి దగ్గర కొన్ని గ్రహశకలాలు(ఆస్టరాయిడ్స్) వస్తుంటాయి. అయితే, వీటిలో కొన్ని భూమిని ఢీకొట్టే ప్రమాదం కూడా ఉంది. ఎప్పటికప్పుడు ప్రపంచ అంతరిక్ష పరిశోధన సంస్థలు వీటిపై నిఘా వేసి ఉంచుతాయి. ఇదిలా ఉంటే, తాజాగా ప్రమాదకరమైన ఒక గ్రహ శకలం భూమి వైపు వచ్చే అవకాశం ఉందని నాసా తెలిపింది.
Mars: సౌర కుటుంబంలో భూమి తర్వాత నివాసయోగ్యంగా ఉండే గ్రహాల్లో ముఖ్యమైంది అంగారకుడు. భూమి లాగే మార్స్ కూడా నివాసయోగ్యానికి అనువైన ‘గోల్డీ లాక్ జోన్’లో ఉంది. కొన్ని బిలియన్ ఏళ్ల క్రితం భూమి లాగే అంగాకరకుడు కూడా సముద్రాలు, నదులు, వాతావరణం కలిగి ఉన్నట్లు శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. అందుకనే అన్ని దేశాల అంతరిక్ష సంస్థలు మార్స్‌పై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాయి.
Ingenuity: అంగారకుడిపై చరిత్ర సృష్టించిన నాసా ‘ఇన్‌జెన్యూనిటీ’ హెలికాప్టర్ తన ప్రస్థానాన్ని ముగించింది. రోబోట్ హెలికాప్టర్ లోని ఒక రోటర్ విరిగిపోవడంతో ఇక అది పైకి ఎగరలేదని నాసా తెలిపింది. జనవరి 18న చివరిసారిగా తన 72వ ఫ్లైట్ తర్వాత పాడైపోయింది. దీనిని నాసా జెట్ ప్రొపల్షన్ లాబోరేటరీ రూపొందించింది. అనుకున్న దానికన్నా ఎక్కువ సార్లు, విజయవంతంగా అంగారకుడి వాతావరణంలో ఇది అద్భుతంగా పనిచేసింది.
Mission to Space Station: భారత్ మరో అంతరిక్ష కార్యక్రమానికి సిద్ధమవుతోంది. భారత వ్యోమగామిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎస్ఎస్)కి పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా భారత్ వైమానిక దళానికి చెందిన పైలెట్లకు శిక్షణ ఇస్తోంది. నాసా-ఇస్రో మధ్య సహకారంలో భాగంగా పైలట్లకు శిక్షణా కార్యక్రమం జరుగుతోంది. 2024 నాటికి భారత వ్యోమగామిని స్పేస్ స్టేషన్కి పంపించాలనే మనదేశం భావిస్తోంది.
Snake Robot: నాసా.. అమెరికా అంతరిక్ష సంస్థ. ప్రస్తుతం అనేక దేశాలతో పోలిస్తే నాసా అంతరిక్ష ప్రయోగాల్లో ముందుంది. ఆర్టిమిస్ మిషన్ ద్వారా చంద్రుడిపైకి మానవుడిని పంపించేందుకు సిద్ధమౌతోంది. ఇదే కాకుండా భవిష్యత్తులో అంగారకుడి పైకి కూడా మానవ సహిత యాత్రలను నిర్వహించాలనే లక్ష్యంతో ఉంది.
NASA: బృహస్పతి రహస్యాన్ని ఛేదించేందుకు నాసా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. నాసా అంతరిక్ష నౌక జునో.. బృహస్పతి భయంకరమైన 'ముఖాన్ని' తన కెమెరాలో బంధించింది. ఇటీవల నాసా ఈ చిత్రాలను విడుదల చేసింది.