Ingenuity: అంగారకుడిపై చరిత్ర సృష్టించిన నాసా ‘ఇన్‌జెన్యూనిటీ’ హెలికాప్టర్ తన ప్రస్థానాన్ని ముగించింది. రోబోట్ హెలికాప్టర్ లోని ఒక రోటర్ విరిగిపోవడంతో ఇక అది పైకి ఎగరలేదని నాసా తెలిపింది. జనవరి 18న చివరిసారిగా తన 72వ ఫ్లైట్ తర్వాత పాడైపోయింది. దీనిని నాసా జెట్ ప్రొపల్షన్ లాబోరేటరీ రూపొందించింది. అనుకున్న దానికన్నా ఎక్కువ సార్లు, విజయవంతంగా అంగారకుడి వాతావరణంలో ఇది అద్భుతంగా పనిచేసింది. మొత్తంగా 2 గంటల 8 నిమిషాల పాటు 72 సార్లు నింగిలోకి వెళ్లింది. 17 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసింది. గరిష్టంగా 24 మీటర్ల ఎత్తు వరకు పైకి వెళ్లింది. 4-పౌండ్ (1.8-కిలోల) రోటర్ క్రాఫ్ట్ ఏప్రిల్ 19, 2021న ఇది మార్స్ పైకి చేరింది.
Read Also: Darshan: హీరోయిన్‌తో ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరో… భార్య సంచలనం?
మూడేళ్ల క్రితం నాసా పంపిన ‘పర్సువరెన్స్’ రోవర్‌తో పాటు ఇన్‌జెన్యూనిటీ హెలికాప్టర్ మార్స్ మీదికి చేరింది. ఇది అంగారకుడి భూభాగంలోని జెరెజో బిలం వద్ద పనిచేసింది. భూమితో పోలిస్తే అత్యంత పలుచటి వాతావరణంలో హెలికాప్టర్ పనిచేస్తుందా.? లేదా? అనే సందేహాల నడుమ ఇది అద్భుతాన్ని సృష్టించింది. భవిష్యత్తులో మానవ ఆవాసాలకు ఆస్కారం ఉన్న మార్స్‌పై శాస్త్రవేత్తల ఆశల్ని ఇన్‌జెన్యూనిటీ మరింతగా పెంచింది. అంగాకరకుడిపై భూమి కన్నా తక్కువ గురుత్వాకర్షణ ఉండటంతో పాటు, భూమితో పోలిస్తే వాతావరణ కేవలం 1 శాతం మాత్రమే దట్టంగా ఉంటుంది. దీంతో ఏరో డైనమిక్ లిఫ్ట్ పొందడం కష్టతరంగా మారుతుంది. అయినప్పటికీ ఇన్‌జెన్యూనిటీ మాత్రం శాస్త్రవేత్తలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. పలుచని, తేలికైన వాతావరణంలో, ఉష్ణోగ్రతల వత్యాసం అధ్యధికంగా ఉన్నప్పటికీ ఇది అన్నింటిని తట్టుకుని పనిచేసింది.