Asteroid: సౌరకుటుంబంలో కొన్ని ఏళ్లకు ఒకసారి భూమికి దగ్గర కొన్ని గ్రహశకలాలు(ఆస్టరాయిడ్స్) వస్తుంటాయి. అయితే, వీటిలో కొన్ని భూమిని ఢీకొట్టే ప్రమాదం కూడా ఉంది. ఎప్పటికప్పుడు ప్రపంచ అంతరిక్ష పరిశోధన సంస్థలు వీటిపై నిఘా వేసి ఉంచుతాయి. ఇదిలా ఉంటే, తాజాగా ప్రమాదకరమైన ఒక గ్రహ శకలం భూమి వైపు వచ్చే అవకాశం ఉందని నాసా తెలిపింది.
ఫుట్‌బాల్ పిచ్ సైజులో ఉండే ఈ ఆస్టరాయిడ్ భూమిని ఢీకొట్టే పరిస్థితి లేనప్పటికీ.. ఇది భూమికి దగ్గరగా వెళ్తోంది. ఆస్టరాయిడ్ 2008 OS7 అని పిలువబడే ఈ గ్రహశకలం దాదాపుగా 890 అడుగుల వ్యాసం కలిగి ఉంటుంది. శుక్రవారం మధ్యాహ్నం 2.41కి భూమికి 1,770,000 మైళ్ల దూరంలో నుంచి ప్రయాణిస్తుంది.
Read Also: Husband locks up wife: 12 ఏళ్లుగా ఇంట్లోనే భార్యను నిర్భందించిన భర్త.. కిటికీ నుంచే పిల్లలకు ఆహారం..
సాధారణంగా 140 మీటర్ల కంటే ఎక్కువ పరిమాణంలో ఉండీ, భూమి నుంచి 7.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో సూర్యుడి చుట్టూ కక్ష్యలో పరిభ్రమించించే గ్రహ శకలాలను ‘‘ ప్రమాదకరమైన గ్రహశకలాలు’’గా అభివర్ణిస్తారు. 2008 OS7, చాలా చిన్న గ్రహశకలం, దీని కక్ష్య భూమితో కలుస్తుంది, ఇది ప్రమాదకరమైన గ్రహశకలంగా వర్గీకరించబడింది. ఇది భూమి వాతావరణంలోకి ప్రవేశించదు కాబట్టి దీంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మన సౌరకుటుంబంలో కొన్ని మిలియన్ల గ్రహశకలాలు ఉన్నాయి. వీటిలో 2350 గ్రహశకలాలను ‘ప్రమాదకర గ్రహశకలాలు’గా వర్గీకరించారు. ఇది ప్రతీ 2.63 భూ సంవత్సరాలకు ఒకసారి సూర్యుడి చుట్టూ తన కక్ష్యను పూర్తి చేస్తుంది.