NASA: బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్ క్యాప్సూల్ ద్వారా ఇటీవల సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లారు. అయితే, అనూహ్యంగా స్టార్‌లైనర్‌లో లీకులు ఏర్పడటంతో ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోనే చిక్కుకుపోయారు. ఆమె వచ్చే అవకాశం ఇప్పట్లో కనిపించడం లేదు. ఆమె అంతరిక్షంలోనే మరో ఆరు నెలల పాటు ఉంటుందని ఇటీవల నాసా ప్రకటించింది.
Sunita Williams : సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లను అంతరిక్షం నుండి తిరిగి తీసుకురావడంలో విఫలమైన స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకను తయారు చేసిన బోయింగ్ సంస్థకు శుభవార్త వచ్చింది.
బోయింగ్ విమానంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) చేరుకున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఈ సంవత్సరం తిరిగి రాలేరు. ఈ ఏడాది వ్యోమగాములు తిరిగి రావడం సాధ్యం కాదని నాసా శనివారం (ఆగస్టు 24) తెలిపింది.
Sunita Williams: అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్ ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. బోయింగ్ స్టార్‌లైనర్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్)కి వెళ్లిన సునితా విలియమ్స్ మరో 6 నెలల పాటు అక్కడే ఉండబోతున్నట్లు నాసా చెప్పింది. సునితా విలియమ్స్ జూన్ 5న ఫ్లోరిడా నుంచి స్టార్‌లైనర్ స్పేస్ క్యాప్సూల్‌లో అంతరిక్షంలోకి వెళ్లింది.
Mars: ఈ అనంత విశ్వంలో భూమిని పోలిన గ్రహాలు, జీవరాశులపై ఎప్పటి నుంచో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. మన సౌరకుటుంబంలోని అంగారక గ్రహం శాస్త్రవేత్తలను ఆకర్షిస్తోంది. 3 బిలియన్ సంవత్సరాల క్రితం అంగారకుడు కూడా భూమి లాగే సముద్రాలు, సరస్సులు, నదులతో నిండి ఉండేదని చాలా పరిశోధనల తర్వాత శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్న ఒక నిజం.
లాంగ్ మార్చ్ 6ఏ రాకెట్ను ఉపయోగించిన చైనా తన మొదటి బ్యాచ్ ఇంటర్నెట్ ఉపగ్రహాలను ఆగస్టు 6, 2024న ప్రయోగించింది. 18 ఉపగ్రహాలను ప్రయోగించారు. ఎలోన్ మస్క్ యొక్క స్టార్ లింక్ ఉపగ్రహాలతో పోటీ పడడమే లక్ష్యంగా చైనా ముందుకు సాగుతోంది.
Sunita Williums : సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతరిక్షం నుండి తిరిగి ఎప్పుడు వస్తారని చూసే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే నాసా ఇచ్చిన సమాచారం పెద్ద షాక్ కలిగించింది.
Shubhanshu Shukla: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా భారత గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) పంపనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇండో-యూఎస్ మిషన్లో అంతరిక్షంలోకి వెళ్లడానికి అత్యంత పిన్న వయస్కుడైన వ్యక్తిని ఎంపిక చేసింది.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తొలి వ్యోమగామిని పంపేందుకు భారత్ సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని మంత్రి జితేంద్ర సింగ్ లోక్సభలో వెల్లడించారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కి చెందిన గగన్యాత్రి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) ప్రయాణిస్తుందని ఆయన తెలియజేశారు.