Shubhanshu Shukla: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)లో అడుగుపెట్టిన రెండో భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డులకు ఎక్కబోతున్నాడు. ఈయన స్పేస్‌ఎక్స్ (SpaceX) సంస్థ అభివృద్ధి చేసిన డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌కు పైలట్‌గా వ్యవహరించబోతున్నారు. ఇందుకు సంబంధించిన అనుమతి కూడా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా (NASA) నుండి ఇటీవల లభించింది. తాజాగా అంతరిక్ష కేంద్రానికి శుక్లా మే 29న వెళ్లనున్నట్లు అధికారికంగా యాక్సియమ్ (Axiom) తెలిపింది. యాక్సియమ్-4 మిషన్‌లో భాగంగా ఆయన మే 29న ఐఎస్‌ఎస్‌కు వెళ్లనున్నారు. ఇక…
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లో అడుగుపెట్టిన మొట్ట మొదటి భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డుకెక్క బోతున్నాడు. స్పేస్‌ఎక్స్(SpaceX) సంస్థ అభివృద్ధి చేసిన డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌కు పైలట్‌గా వ్యవహరించబోతున్న విషయం తెలిసిందే. ఇందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అనుమతి కూడా ఇటీవల లభించింది.
నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ సాధారణ స్థితికి వచ్చేశారు. ఇందుకు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలే నిదర్శనం. పెంపుడు కుక్కలతో జాలిగా గడిపారు. కుక్కలు కూడా చాలా సందడిగా.. ఆనందంగా కనిపించాయి. చాలా రోజులవ్వడంతో మీద.. మీద పడి ముద్దులు పెట్టాయి.
సునీతా విలియమ్స్ భూమిపై అడుగుపెట్టారు. స్పేస్‌ఎక్స్ క్యాప్సూల్ ఫ్లోరిడా తీరంలో దిగిన విషయం తెలిసిందే. ఆమె దిగిన వెంటనే.. ఆ క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ క్యాప్సూల్ చుట్టూ అనేక డాల్ఫిన్లు చుట్టుముట్టాయి. ఈ డాల్ఫిన్లు చాలా సేపు క్యాప్సూల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. వాటిని చూస్తుంటే ఏదో చెప్పాలనుకుంటున్నట్లు అనిపించింది. ఈ అందమైన దృశ్యానికి సంబంధించిన వీడియో కూడా బయటపడింది.
తొమ్మిది నెలలుగా నెలకొన్న ఉత్కంఠకు ఈ రోజు తెరపడింది. దివి నుంచి వ్యోమగాములు దివికి చేరుకున్నారు. దాదాపు తొమ్మిది నెలలుగా అంతరిక్షంలోనే ఉండిపోయిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ తోపాటూ.. బుచ్ విల్మోర్ మరో ఇద్దరు వ్యోమగాములు.. విజయవంతంగా భూమిపై అడుగు పెట్టారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి మంగళవారం తిరుగు ప్రయాణమైన వాళ్లు.. భారత కాలమానం ప్రకారం ఇవాళ తెల్లవారుజామున 3.27 నిమిషాలకు ఫ్లోరిడా సముద్ర తీరంలో సేఫ్‌గా ల్యాండ్ అయ్యారు. ఈ అంశంపై…
స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్‌లో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లతోపాటు, నాసా వ్యోమగామి, మిషన్ కమాండర్ నిక్ హేగ్, రోస్కాస్మస్ వ్యోమగామి అలెగ్జాండర్ గుర్బునోవ్‌లు భూమి మీదకు సురక్షితంగా వచ్చారు. దీంతో, ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన మిషన్ విజయవంతంగా పూర్తయింది. వీరి రాకపై స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. ఈసందర్భంగా అధ్యక్షుడు ట్రంప్‌నకు కృతజ్ఞతలు తెలిపారు.
గతేడాది జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి వెళ్లారు సునీతా విలియమ్స్. అయితే వారంలోనే తిరిగి రావాల్సి ఉండగా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో సునీతా విలియమ్స్ తో పాటు బుచ్ విల్మోర్ అంతరిక్షంలో చిక్కుకుపోయిరు. ఆమెను తిరిగి తెలుసుకువచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసిన అవేవి సత్ఫాలితాలు ఇవ్వలేదు. 9 నెలల పాటు అంతరిక్షంలో గడిపిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బ్యారీ బుచ్ విల్మోర్లు ఎట్టకేలకు స్పేస్ఎక్స్కు చెందిన డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో భూమిపైకి తిరిగి వచ్చారు. భూ…
నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ రాక చాలా ఉల్లాసంగా సాగినట్లుగా కనిపిస్తోంది. వాతావరణం పూర్తిగా ఆమెకు అనుకూలంగా మారింది. ఇక ఆమె రాకను ప్రజలే కాదు.. ప్రకృతి కూడా పులకించింది. సునీతా విలియమ్స్‌ను తీసుకొచ్చిన క్యాప్సూల్.. సముద్రంపై ల్యాండ్ కాగానే ఆమె చుట్టూ డాల్ఫిన్ల గుంపు తిరుగుతూ కనిపించాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమ్మీదకు చేరింది. దాదాపు 9 తొమ్మిది నెలల తర్వాత ఆమె భూమ్మీద అడుగుపెట్టింది. క్యాప్సూల్ నుంచి బయటకు వస్తూ సునీతా విలియమ్స్ చిరునవ్వులు చిందించారు. అందరికీ హాయ్ చెబుతూ.. చాలా ఉల్లాసంగా కనిపించారు. ఆమెలో ఎలాంటి ఆందోళన కనిపించలేదు. చాలా ఉత్సాహంగా.. ఆనందంగా ఉన్నట్లు వీడియోను బట్టి తెలుస్తోంది.
నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ క్షేమంగా భూమ్మీదకు చేరుకుంది. దాదాపు తొమ్మిది నెలల తర్వాత అంతరిక్షం నుంచి సురక్షితంగా భూమ్మీద ల్యాండ్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులతో పాటు ప్రజలంతా స్వాగతం పలుకుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంతేకాకుండా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.